Hyderabad Metro: క్రికెట్ ఫ్యాన్స్‌కు హైదరాబాద్ మెట్రో బంపరాఫర్.. అర్ధరాత్రి వరకు..!

క్రికెట్ అభిమానులకు మెట్రో సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చినవారికి..

Hyderabad Metro: క్రికెట్ ఫ్యాన్స్‌కు హైదరాబాద్ మెట్రో బంపరాఫర్.. అర్ధరాత్రి వరకు..!
Hyderabad Metro
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 24, 2022 | 9:36 AM

ప్రస్తుతం ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ జరుగుతోంది. రెండు టీమ్‌లు చెరో మ్యాచ్ విజయం సాధించడంతో.. సిరీస్ 1-1 సమంగా ఉంది. ఇక నిర్ణయాత్మక చివరి టీ20 ఆదివారం అనగా సెప్టెంబర్ 25వ తేదీన హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నేపధ్యంలో క్రికెట్ అభిమానులకు మెట్రో సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చినవారికి వీలుగా రేపు రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు స్పెషల్ మెట్రో రైలు సర్వీసులు నడవనున్నాయి.

అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ స్పెషల్ సర్వీసులు కేవలం స్టేడియం స్టేషన్ నుంచే ఉంటాయి. ఇక అమీర్‌పేట్, జేబీఎస్ స్టేషన్ల నుంచి కనెక్షన్ ట్రైన్ సర్వీస్‌లు అందుబాటులో ఉండనున్నాయి. అటు ప్రత్యేక రైళ్లు నడిచే సమయంలో ఉప్పల్, స్టేడియం, NGRI మెట్రో స్టేషన్లలో మాత్రమే ఎంట్రీ గేట్స్ తెరిచి ఉంటాయని మెట్రో అధికారులు స్పష్టం చేశారు. అలాగే దిగబోయే ప్రయాణీకుల కోసం మిగతా స్టేషన్లలో ఎగ్జిట్ గేట్స్ ఓపెన్ చేసి ఉంటాయని తెలిపారు. కాగా, మెట్రో స్టేషన్లలో రాత్రి 10 గంటల వరకే టికెట్ కౌంటర్లు తెరిచి ఉంటాయని.. రిటర్న్ టికెట్లు కొనుగోలు చేసేవారు రాత్రి 10 గంటలలోపు తీసుకోవాలని సూచించారు. అటు రాత్రి 10.15 గంటల తర్వాత నుంచి డిజిటల్ టికెట్స్ కొనుగోలుకు ఛాన్స్ ఉండదని పేర్కొన్నారు.

సిటీ బస్సు సర్వీసులు పొడిగింపు..

క్రికెట్ ఫ్యాన్స్‌కు టీఎస్ఆర్టీసీ కూడా గు‌డ్‌న్యూస్ అందించింది. సెప్టెంబర్ 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపధ్యంలో ప్రయాణీకుల సౌకర్యం కోసం సిటీ బస్సు సర్వీసులను పొడిగించింది. ఉప్పల్ స్టేడియం నుంచి ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ సికింద్రాబాద్‌ రీజియన్‌ మేనేజర్‌ సీహెచ్‌ వెంకన్న వెల్లడించారు. మేడ్చల్‌, హకీంపేట్‌, సికింద్రాబాద్‌, జేబీఎస్‌, జీడిమెట్ల, ఘట్‌కేసర్‌, కోఠి, మోహిదీపట్నం, పటాన్‌చెరు వంటి వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియం వరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. ప్రయాణీకులు దృష్టిలో పెట్టుకుని ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని వెంకన్న కోరారు.

కాగా, క్రికెట్ మ్యాచ్‌ టికెట్ల విషయంలో వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జింఖానా గ్రౌండ్స్ వద్ద టికెట్ల కోసం భారీగా అభిమానులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఇందులో పలువురికి గాయాలు అయిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ సర్కార్ సీరియస్ కావడమే కాకుండా.. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ను తీవ్రంగా మందలించింది.

మరిన్ని హైదరాబాద్ వార్తలు కోసం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే