Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంతే కాకుండా తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంపై..

Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
Andhra Weather Report
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 24, 2022 | 9:50 AM

తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంతే కాకుండా తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టంపై 4.5 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్ లో సాధారణ వర్షపాతం నమోదు కానుందని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యి.. ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోనూ జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదైంది.

మరోవైపు.. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇవాళ (శనివారం) తేలిక పాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, తిరుపతి, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు కురుస్తాయని, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..