AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కనిపించే దేవత ఈ వైద్యురాలు.. వీడియో చూస్తే మీరే చేతులెత్తి దండం పెడతారు..

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను పోసే శక్తి ఆ దేవుడి తరువాత వైద్యులకు మాత్రమే ఉంది. అందుకే వైద్యో నారాయణో హరి అంటారు. కనిపించే దేవుడు వైద్యుడు.. ఎవరికీ చెప్పలేని బాధలను కేవలం వైద్యులకు మాత్రమే చెబుతాం..

Viral Video: కనిపించే దేవత ఈ వైద్యురాలు.. వీడియో చూస్తే మీరే చేతులెత్తి దండం పెడతారు..
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Sep 24, 2022 | 6:25 AM

Share

Agra doctor’s video: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను పోసే శక్తి ఆ దేవుడి తరువాత వైద్యులకు మాత్రమే ఉంది. అందుకే వైద్యో నారాయణో హరి అంటారు. కనిపించే దేవుడు వైద్యుడు.. ఎవరికీ చెప్పలేని బాధలను కేవలం వైద్యులకు మాత్రమే చెబుతాం.. ఎవరైనా ప్రాణాపాయంలో ఉంటే.. వెంటనే స్పందించి ప్రాణం పోస్తారు. కొందరు డబ్బుల కోసం పనిచేస్తుంటే.. మరికొందరు సేవే పరమావధిగా భావించి వైద్యం అందిస్తారు. అలాంటి వైద్యులను బాధిత వ్యక్తులు దేవుడికంటే ఎక్కువగా కొలుస్తారు. తాజాగా ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఊపిరి ఆడకుండా పుట్టిన పసిపాపకు ఓ వైద్యురాలు తన ఊపిరి ఊది ప్రాణం పోసింది. నిమిషాల వ్యవధిలో ఆ చిన్నారి గొంతు నుంచి కేరింతలు వచ్చేలా చేసి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని సీహెచ్‌సీలో మార్చిలో జరిగింది.

ఈ వీడియోలో వైద్యురాలు నవజాత శిశువును మృత్యువు బారి నుంచి రక్షించడం కనిపిస్తుంది. ఓ గర్భిణీకి ప్రసవం చేసి బిడ్డకు బయటకు తీశారు. అయితే.. ఆ చిన్నారి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఉలుకుపలుకు లేకుండా మిన్నకుండిపోయింది. ఆడపిల్ల ఏడవకపోవడం, పుట్టిన తర్వాత ఆమె శరీరంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో వెంటనే అలర్ట్ వైద్యురాలు.. వెంటనే చిన్నారిని సీపీఆర్ చేసి ప్రాణం పోసింది. కాగా, ఈ వీడియో ఈ ఏడాది మార్చిలోనిది, అయితే ఇది మరోసారి వైరల్‌గా మారింది. వైద్యురాలు సురేఖ చౌదరి.. నవజాత శిశువు ఆక్సిజన్‌ తీసుకోకపోవడంతో దాదాపు 7 నిమిషాల పాటు సీపీఆర్‌ చేసి.. నోటి ద్వారా శ్వాస అందించి ప్రాణాలను కాపాడారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా నెటిజన్లు ఆమెను భగవంతుని స్వరూపంగా కొనియాడుతున్నారు. దీన్ని 10 లక్షలకు పైగా వీక్షించి వైద్యురాలి సేవలను కొనియాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన 26 సెకన్ల వీడియోను పోలీసు సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మరోసారి వైరల్‌ అయింది.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..