Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakisthan: ఎట్టకేలకు దిగివచ్చిన పాక్ మాజీ ప్రధాని.. తన బెదిరింపు వ్యాఖ్యలకు మహిళా జడ్జికి క్షమాపణలు చెప్పిన ఇమ్రాన్ ఖాన్

వాస్తవానికి, ఆగస్టు 20 న రాజధానిలో జరిగిన ర్యాలీలోఇమ్రాన్ ఖాన్ తన సహోద్యోగి షాబాజ్ గిల్‌తో అనుచితంగా ప్రవర్తించినందుకు పోలీసు అధికారులు, ఎన్నికల సంఘం, రాజకీయ ప్రత్యర్థులపై కేసు నమోదు చేస్తానని బెదిరించారు.

Pakisthan: ఎట్టకేలకు దిగివచ్చిన పాక్ మాజీ ప్రధాని.. తన బెదిరింపు వ్యాఖ్యలకు మహిళా జడ్జికి క్షమాపణలు చెప్పిన ఇమ్రాన్ ఖాన్
Pakistan Former PM Imran Khan (File Photo)
Follow us
Surya Kala

|

Updated on: Sep 30, 2022 | 6:57 PM

Pakisthan: పాకిస్థాన్ మహిళా న్యాయమూర్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎట్టకేలకు మహిళా న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పారు. పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి గా పనిచేస్తున్న  జెబా చౌదరి కోర్టుకు హాజరయ్యారు. ఖాన్ ఎవరిపై వివాదాస్పద వ్యాఖ్య చేశారో ఆమె న్యాయమూర్తి జెబా చౌదరి కావడం విశేషం. కోర్టుకు హాజరైన తర్వాత.. ఇమ్రాన్ ఖాన్ తన బెదిరింపు వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు పై విచారం వ్యక్తం చేశారు. . అయితే మహిళా న్యాయమూర్తి జెబా కోర్టుకు హాజరుకాలేదు. కోర్టులో రీడర్, స్టెనో ముందు హాజరుకాని మహిళా న్యాయమూర్తి జెబా చౌదరికి ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు చెప్పారు. అంతేకాదు ‘జెబా చౌదరి కోర్టుకు వచ్చినప్పుడు.. తాను ఆమెకు క్షమాపణ చెప్పడానికి కోర్టుకు వచ్చానని చెప్పమని సిబ్బందికి సూచించారు.

అంతకుముందు సెక్షన్ 144 ఉల్లంఘన కేసులో ఇస్లామాబాద్ జిల్లా, సెషన్స్ కోర్టు ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కోర్టు వెలుపల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మాజీ ప్రధాని ఖాన్ సెప్టెంబర్ 22న ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరయ్యారు. మహిళా న్యాయమూర్తిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పేందుకు సుముఖత వ్యక్తం చేశారు. జీబా చౌదరికి క్షమాపణలు చెప్పేందుకు ఖాన్ సుముఖత వ్యక్తం చేయడంతో ఇస్లామాబాద్ హైకోర్టు అతనిపై ధిక్కార విచారణను వాయిదా వేసింది.

అసలు విషయంలోకి వెళ్తే..  వాస్తవానికి, ఆగస్టు 20 న రాజధానిలో జరిగిన ర్యాలీలోఇమ్రాన్ ఖాన్ తన సహోద్యోగి షాబాజ్ గిల్‌తో అనుచితంగా ప్రవర్తించినందుకు పోలీసు అధికారులు, ఎన్నికల సంఘం, రాజకీయ ప్రత్యర్థులపై కేసు నమోదు చేస్తానని బెదిరించారు. అప్పుడు ఈ వివాదం ప్రారంభమైంది. దేశద్రోహం ఆరోపణలపై గిల్‌ను అరెస్టు చేశారు. గిల్‌ను రెండు రోజుల కస్టడీకి పంపాలన్న పోలీసుల అభ్యర్థనను అంగీకరించిన న్యాయమూర్తి జెబా చౌదరి నిర్ణయంపై మాజీ ప్రధాని ఇమ్రాన్   అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇమ్రాన్ ఖాన్ బెదిరింపు: ప్రసంగం ముగిసిన కొన్ని గంటల తర్వాత..  తన ర్యాలీలో రాష్ట్రంలోని పోలీసులు, న్యాయవ్యవస్థ, ఇతర సంస్థలను బెదిరించినందుకు ఇమ్రాన్ ఖాన్‌పై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయబడింది. జస్టిస్ అమీర్ ఫరూక్, గిల్ పోలీసు రిమాండ్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ, ఖాన్‌పై ధిక్కార విచారణను ప్రారంభించాలని నిర్ణయించారు. కోర్టును సంతృప్తి పరచడానికి వ్రాతపూర్వక సమాధానం ఇవ్వడానికి హైకోర్టు ఇమ్రాన్ కు  రెండుసార్లు అవకాశం ఇచ్చింది. అయితే అతను తన సమాధానంతో కోర్టును సంతృప్తి పరచడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత ఆయనను అభిశంసిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..