స్కూల్లో ఆత్మాహుతి దాడి.. 100 మంది విద్యార్థులు దుర్మరణం..

భారీ పేలుడు నేప‌థ్యంలో 100 మంది విద్యార్థులు చ‌నిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. క్లాస్ రూమ్ మొత్తం ర‌క్తంతో నిండిపోయింది.

స్కూల్లో ఆత్మాహుతి దాడి.. 100 మంది విద్యార్థులు దుర్మరణం..
Blast
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 30, 2022 | 6:33 PM

అక్కడి పాఠశాల ప్రాంగణంలో రక్తపుటేరులు పారాయి. ఆత్మహుతి దాడిలో ముక్కుపచ్చలారని విద్యార్థులు వందమంది వరకు మృత్యువాతపడ్డారు. ఎటు చూసినా విద్యార్థుల చిధ్రమైన శరీర భాగాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఈ దారుణ ఘటన ఆప్ఘ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌లో జరిగింది. స్థానిక జర్నలిస్టు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటనలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలిసింది.

కాబూల్‌లోని ద‌స్తే బార్చి ప్రాంతంలో గల కాజ్ ఎడ్యుకేష‌న్ సెంట‌ర్ వ‌ద్ద భారీ పేలుడు సంభ‌వించింది. విద్యార్థులు యూనివ‌ర్సిటీ ఎగ్జామ్ రాస్తుండ‌గా ఈ పేలుడు సంభ‌వించిన‌ట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ పేలుళ్ల‌పై స్థానిక జ‌ర్న‌లిస్ట్ బిలాల్ స‌ర్వారీ ట్వీట్ చేశారు. భారీ పేలుడు నేప‌థ్యంలో 100 మంది విద్యార్థులు చ‌నిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. క్లాస్ రూమ్ మొత్తం ర‌క్తంతో నిండిపోయింది. కాజ్ ఉన్నత విద్యా కేంద్రంలోని బోధకులలో ఒకరు మాట్లాడుతూ.. మరణించిన పిల్లలకు సంబంధించి చేతులు, కాళ్ళు దొరికాయని చెప్పారు. యూనివ‌ర్సిటీ ఎంట్రెన్స్ మాక్ టెస్టు రాస్తుండ‌గా పేలుడు సంభ‌వించిన‌ట్లు జ‌ర్న‌లిస్టు బిలాల్ స‌ర్వారీ పేర్కొన్నాడు. విద్యార్థుల శ‌రీర భాగాలు చెల్లాచెదురుగా ప‌డిపోయాయ‌ని తెలిపాడు. హ‌జారా మైనార్టీ వ‌ర్గానికి చెందిన వాళ్లే ఆ స్ట‌డీ సెంట‌ర్ వ‌ద్ద ఎక్కువ సంఖ్య‌లో ఉన్న‌ట్లు భావిస్తున్నారు. స్థానిక జర్నలిస్టు చెప్పిన వివరాల ప్రకారం, ఈ సంఘటనలో విద్యార్థులు ఎక్కువగా హజారాలు, షియాలు మరణించారు. హజారాలు ఆఫ్ఘనిస్తాన్ లో మూడవ అతిపెద్ద జనభా.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌కు యుఎస్ మిషన్‌లో ఛార్జ్ డి అఫైర్స్, కరెన్ డెక్కర్ ఒక ట్వీట్‌లో, “కాజ్ ఉన్నత విద్యా కేంద్రం పై జరిగిన దాడిని యుఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో నిండిన గదిని లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటు, విద్యార్థులందరూ ప్రశాంతంగా భయం లేకుండా విద్యను అభ్యసించండి అంటూ ట్వీట్ చేసారు. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వీడియోలు, స్థానిక మీడియా ప్రచురించిన భయనక దృశ్యాలు అందరినీ భయపడిపోయేలా చేస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి