మా తల్లే నెలానెలా సర్కారీ సొమ్ము మింగేస్తుంది.. ఇంతవరకూ ఆఫీసు జాడ కూడా తెలీదు.. చివరకు
కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం సర్కార్ జీతం తీసుకుంటూ ఆఫీసుకు వెళ్లకుండా ఎంజాయ్ చేస్తున్నారు. అలా నెలల తరబడి కొలువుకు హాజరు కాకుండానే జీతం తీసుకుంటున్న ఓ గొప్ప అధికారి భాగోతం ఎట్టకేలకు బయటపడింది.
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. అందుకోసం ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతూ పుస్తకాల పురుగుల్లా మారిపోయి చదువుతుంటారు. ఒకటి,రెండు సార్లు.. కాదు.. ఉద్యోగం కోసం ఎన్ని సార్లైనా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే, ప్రభుత్వ ఉద్యోగమంటే ఆ లెవలే వేరు అన్నట్టు. కానీ, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం సర్కార్ జీతం తీసుకుంటూ ఆఫీసుకు వెళ్లకుండా ఎంజాయ్ చేస్తున్నారు. అలా నెలల తరబడి కొలువుకు హాజరు కాకుండానే జీతం తీసుకుంటున్న ఓ గొప్ప అధికారి భాగోతం ఎట్టకేలకు బయటపడింది. దాంతో డిప్యూటీ సీఎం స్వయంగా చర్యలకు ఆదేశించారు. ఇలాంటి సంఘటన ఉత్తరప్రదేశ్ లక్నోలో చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే…
ఆరు నెలలుగా ఆఫీసుకు రాకుండా తన జీతం విత్‌డ్రా చేసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో అమ్రోహా జిల్లా డిప్యూటీ సీఎంఓ డాక్టర్ ఇందు బాల శర్మను సస్పెండ్ చేస్తూ యూపీ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ ఆదేశించారు. ఆఫీసుకు రాకుండా గత ఆరు నెలలుగా ఇందు బాల శర్మ జీతం తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందిన క్రమంలో సదరు ప్రభుత్వ అధికారిణిని ఎట్టకేలకు సస్పెండ్ చేశారు. డిప్యూటీ సీఎం కార్యాలయానికి చెందిన అధికారిణి డాక్టర్ ఇందు బాల శర్మ, అమ్రోహా జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆమె గత ఆరు నెలలుగా కార్యాలయానికి రావడం లేదు. అయినప్పటికీ ప్రతి నెలా జీతాన్ని మాత్రం టక్షన్‌గా తీసుకుంటున్నారట. కాగా, ప్రభుత్వ కార్యాలయంలోని హాజరు పట్టీలో ఆ అధికారిణి నకిలీ సంతాకాలున్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇందు బాల శర్మను సస్పెండ్ చేయాలని యూపీ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ ఆదేశించారు. ఆమెపై శాఖాపరమైన విచారణకు సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
అలాగే వేతనాల జారీకి ఇన్‌చార్జిగా ఉన్న సంతోష్ కుమార్‌పై కూడా శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరిపైనా చర్యలు తీసుకోవడంతోపాటు కేసు నమోదు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..