AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారితప్పి నగరానికొచ్చిన సింహం.. జాగింగ్‌ చేస్తున్న మహిళని చూసి ఏం చేసిందో తెలిస్తే అవాక్కే!

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న వీడియోలో ఒక సింహం వాకింగ్‌ చేస్తున్న మహిళను చూసి ఊహించని పని చేసింది.. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

దారితప్పి నగరానికొచ్చిన సింహం.. జాగింగ్‌ చేస్తున్న మహిళని చూసి ఏం చేసిందో తెలిస్తే అవాక్కే!
Lion
Jyothi Gadda
|

Updated on: Sep 30, 2022 | 3:38 PM

Share

సోషల్ మీడియాలో ప్రతినిత్యం అనేక వీడియోలు అప్‌లోడ్‌ అవుతుంటాయి. వాటిలో ముఖ్యంగా జంతువులు, పక్షులు, పాములకు సంబంధిచిన వీడియోలు ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వీడియోలనే నెటిజన్లు కూడా తెగ ఇష్టపడుతుంటారు. లైకులు, కామెంట్లు చేస్తూ షేర్‌ చేస్తుంటారు. ఇక కొన్ని వీడియోల్లో చిన్నాపిల్లల అల్లరి, యువతీ యువకుల హంగామా, వృద్ధులు చేసే సహాస విన్యాసాలు సైతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంటాయి. జంతువుల వీడియోల్లో ఎక్కువగా ఏనుగులు, పులి,సింహాలకు సంబంధించి వీడియోలు బాగా వైరల్‌ అవుతుంటాయి. అయితే, ఇక్కడ అలాంటిదే మరో వీడియో షోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఈ వీడియోలో అడవికి రాజైన మృగరాజు ఓ మహిళను చూసి భయంతో దాక్కున్నట్టుగా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న వీడియోలో ఒక సింహం వాకింగ్‌ చేస్తున్న మహిళను చూసి పొదల మాటున దాక్కుంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ వీడియో వైర‌ల్ గా మారింది. ఓ సింహం ఇంటి ముందు ఉన్న పొద‌ల్లో కూర్చుని ఉంది. అదే స‌మ‌యంలో ఒక మహిళ రోడ్డుపై జాగింగ్ చేస్తోంది. అడవి జంతువులు మనుషులు కనిపిస్తే చాలు..ఆహా.. మంచి ఆహారం లభించినట్టే అనుకుంటాయి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేటసాగిస్తాయి. కానీ, అతి తక్కువ సందర్భాలలో మాత్రమే అడవి జంతువులు మనుషులను చూసి బెదురుకుంటాయి. బెదిరింపులకు గురైనప్పుడు మాత్రమే అవి ప్రతిస్పందిస్తాయి. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. పొద‌ల్లో దాక్కున్న ఆ సింహం జాగింగ్ చేస్తోన్న మ‌హిళ‌ని భయపడిపోయిందో ఏమో తెలియదుగానీ, ఆమె చూస్తూ అలాగే ఉండిపోయింది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా షేర్‌ చేసిన ఈ వీడియోని నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు. షేర్ చేసిన‌ప్ప‌టి నుండి 41,000 కంటే ఎక్కువ మంది చూశారు. కాగా 1,900 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. 300 మందికి పైగా వినియోగదారులు ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. అనేక మంది వినియోగదారులు పోస్ట్‌పై రకరకాల కామెంట్స్‌ చేస్తు్న్నారు. ఇది ఖచ్చితంగా అద్భుతమ‌ని ఓ నెటిజ‌న్ వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం. ..ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!