AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెర మీదే కాదు.. తెర వెనుక కూడా చక్రం తిప్పే సత్తా ఉందంటున్న స్టార్స్..

స్టోరి లాక్ అయిన సినిమాకు దర్శకుడు హ్యాండిచ్చినా మై హునా అంటున్నారు స్టార్స్‌. తెర మీదే కాదు.. తెర వెనుక చక్రం తిప్పే సత్తా మాకు ఉందని ప్రూవ్ చేస్తున్నారు,.

తెర మీదే కాదు.. తెర వెనుక కూడా చక్రం తిప్పే సత్తా ఉందంటున్న స్టార్స్..
Direction
Jyothi Gadda
|

Updated on: Sep 29, 2022 | 9:48 PM

Share

ఒకప్పుడు డైరెక్టర్స్ హ్యాండిస్తే ఆ సినిమాను పక్కన పెట్టేసేవారు స్టార్స్‌. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టోరి లాక్ అయిన సినిమాకు దర్శకుడు హ్యాండిచ్చినా మై హునా అంటున్నారు స్టార్స్‌. తెర మీదే కాదు.. తెర వెనుక చక్రం తిప్పే సత్తా మాకు ఉందని ప్రూవ్ చేస్తున్నారు,.

ఈ లిస్ట్‌లో అందరికంటే ముందున్న స్టార్‌ కంగనా రనౌత్‌. మణికర్ణిక సినిమా షూటింగ్ సమయంలో కంగనతో విభేదాలు రావటంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నారు దర్శకుడు క్రిష్. దీంతో వెంటనే మెగా ఫోన్ అందుకున్న కంగనా ఆ సినిమాకు దర్శకురాలిగా మారి షూటింగ్ పూర్తి చేశారు. మణికర్ణిక సూపర్ హిట్ కావటంతో దర్శకురాలిగానూ కంటిన్యూ అవుతున్నారు ఈ బాలీవుడ్ బ్యూటీ.

రీసెంట్‌గా అజయ్ దేవగన్‌ కూడా ఇలాంటి సాహసమే చేశారు. 2008లోనే దర్శకుడిగా మారిన అజయ్‌.. తరువాత శివాయ్‌, రణ్‌వే 34 లాంటి సినిమాలను స్వయంగా కథ రెడీ చేసుకొని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలకు మంచి రెస్పాన్స్ రావటంతో అడపాదడపా దర్శకత్వం వైపు కూడా చూస్తున్నారు. కానీ రీసెంట్‌గా భోళా సినిమాను అనుకోకుండా టేకప్ చేశారు అజయ్. ముందు వేరే దర్శకుడితో సినిమా చేయాలనుకున్నా.. ఆ డైరెక్టర్ హ్యాండివ్వటంతో దర్శకత్వం బాధ్యతలు కూడా తీసుకున్నారు అజయ్‌ దేవగన్‌.

ఇవి కూడా చదవండి

తాజాగా మరో బాలీవుడ్ స్టార్ రణదీప్‌ హుడా కూడా ఈ లిస్ట్‌లోకి చేరారు. మహేష్‌ మంజ్రేకర్ దర్శకత్వంలో స్వతంత్రవీర్‌ సావర్కర్ సినిమాను ఎనౌన్స్‌ చేశారు రణదీప్‌. అయితే షూటింగ్ స్టార్ట్ చేయటం ఆలస్యం కావటంతో మహేష్‌ డేట్స్ క్లాష్ అయ్యాయి. ప్రియర్‌ కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా డైరెక్ట్ చేయలేనంటూ మహేష్‌ తప్పుకున్నారు. దీంతో దర్శకత్వ బాధ్యతలు కూడా స్వయంగా తీసుకున్నారు రణదీప్‌ హుడా.

సావర్కర్ సినిమా కోసం చాలా రోజులుగా ప్రీపేర్ అవుతున్నారు రణదీప్‌. ఈ సినిమాలో స్లిమ్ లుక్‌లో కనిపించేందుకు ఏకంగా 50 కిలోలు బరువు తగ్గారు. ఇంతగా కథలో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి… దర్శకుడిగా ఆయనే పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫిక్స్ అయ్యారు మేకర్స్‌.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.