AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెడికల్ షాపు నుంచి తెచ్చిన ట్యాబ్లెట్‌లో పురుగులు.. గర్భిణీ ఆరోగ్యంపై బంధువుల ఆందోళన

అంజలి అనే మహిళకు ఈ మాత్రలు అందాయి. ఆమె రెండు నెలల గర్భిణి. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చెక్అప్ కు వెళ్లింద. అక్కడే స్థానికంగా ఉన్న ఆస్పత్రి మెడికల్ షాపులో మాత్రలు తెచ్చుకుంది.

మెడికల్ షాపు నుంచి తెచ్చిన ట్యాబ్లెట్‌లో పురుగులు.. గర్భిణీ ఆరోగ్యంపై బంధువుల ఆందోళన
Worms Found In Tablets
Jyothi Gadda
|

Updated on: Sep 29, 2022 | 8:11 PM

Share

పప్పులు, బియ్యం, కూరగాయల్లో పురుగులు రావటం సహాజం. కొన్ని సందర్భాల్లో వండిన ఆహార పదార్థాల్లోనూ పురుగులు కనిపిస్తుంటాయి. కొన్ని కొన్ని సార్లు దుకాణాల్లో కొనుగోలు చేసిన చాక్లెట్స్‌, బిస్కెట్స్‌లో పురుగులు కనిపించిన సంఘటనలు మనం చూశాం. కానీ, ఇది ఎంతటి నిర్లక్ష్యం..రోగులు వాడే మందుబిల్లల్లోనూ పురుగులు ప్రత్యక్షమైతే..వారి పరిస్థితి ఎంటీ..? వారిని ఎవరు కాపాడాలి. ఓ మెడికల్ షాపు నుంచి తెచ్చిన మాత్రలో పురుగులు కనిపించాయి. అది గమనించిన బాధితుల అప్రమత్తతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం, కలబురిగి జిల్లాలో చోటు చేసుకుంది.

ఓ మెడికల్ షాపు నుంచి తెచ్చిన జింకోవిట్ ట్యాబ్లెట్‌లో పురుగులు కనిపించటం కలకలం రేపింది. నారింజ రంగు మాత్రలో చిన్న నల్ల పురుగులు ఉన్నాయని ఓ మహిళ ఆరోపించింది. అంజలి అనే మహిళకు ఈ మాత్రలు అందాయి. అంజలి రెండు నెలల గర్భిణి. సెప్టెంబర్ 23న కలబుర్గిలోని సంజీవిని ప్రైవేట్ ఆస్పత్రిలో చెక్‌ చేయించుకుంటోంది. అక్కడే స్థానికంగా ఉన్న ఆస్పత్రిలోని మెడికల్ షాపులో మాత్రలు తెచ్చుకుంది. ప్రతి నెలా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ,..అక్కడే మందులు తీసుకుంటున్నట్టుగా బాధితులు చెప్పింది. ఈ క్రమంలోనే ఇప్పుడు అదే షాపులో మందులు కొనుగోలు చేసినట్టుగా తెలిపింది.

సగం నెలకు సరిపడా మెడిసిన్స్‌ కొన్నట్టుగా చెప్పింది. అందులో ఐదు వాడేసి. గురువారం రోజున మరో మాత్ర వేసుకోగా అందులో పురుగులు కనిపించాయి. మెడికల్ షాపులో అడిగితే మా దగ్గర ఆ మాత్రలు రాలేదని సమాధానమిస్తున్నారు. మెడికల్ షాపు సిబ్బందిపై అంజలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మాత్రలను వేసుకుంటే ఆ గర్భిణీ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రధాని మోదీ ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి సీక్రెట్స్‌ ఏంటో తెలుసా?
ప్రధాని మోదీ ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి సీక్రెట్స్‌ ఏంటో తెలుసా?
ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఓటీటీలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఓటీటీలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
APPSC నుంచి వరుసగా 20 నోటిఫికేషన్లు విడుదల.. ఎన్ని పోస్టులంటే?
APPSC నుంచి వరుసగా 20 నోటిఫికేషన్లు విడుదల.. ఎన్ని పోస్టులంటే?
ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!
ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు!
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు!
ఆధార్ లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం డెసిషన్..
ఆధార్ లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం డెసిషన్..
రూ.1 కోటి ఇల్లు vs రూ.40 వేల అద్దె.. కోటీశ్వరులెవరు..?
రూ.1 కోటి ఇల్లు vs రూ.40 వేల అద్దె.. కోటీశ్వరులెవరు..?
ఏపీలో 1156 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ఏపీలో 1156 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ఎడారిలో పిల్లల కోసం నీటిని మోసుకొచ్చే పక్షి..
ఎడారిలో పిల్లల కోసం నీటిని మోసుకొచ్చే పక్షి..
ఆ గ్రామంలో రాత్రికి రాత్రే మిస్సవుతున్న కోళ్లు, మేకలు..
ఆ గ్రామంలో రాత్రికి రాత్రే మిస్సవుతున్న కోళ్లు, మేకలు..