ఇంతకంటే గుడ్ బాయ్ ఉంటాడా..? మర్చిపోయి సిగ్నల్ జంప్ చేశాను.. ఫైన్ ఎంత కట్టాలంటూ పోలీసులకే ట్వీట్

ట్రాఫిక్‌ నిబంధనలు మర్చిపోయి ఉల్లంఘించిన ఒక వాహనదారుడు..ఆ విషయాన్ని అతడు నిజాయితీగా బయటపెట్టాడు. అర్జెంట్ పని ఏదైనా ఉందో ఏమో తెలియదు గానీ, బాల కృష్ణ బిర్లా అనే వ్యక్తి శాంతినగర్ లో సిగ్నల్ జంప్ చేసి ఇంటికి వెళ్లాడు.

ఇంతకంటే గుడ్ బాయ్ ఉంటాడా..? మర్చిపోయి సిగ్నల్ జంప్ చేశాను.. ఫైన్ ఎంత కట్టాలంటూ పోలీసులకే ట్వీట్
Traffic Challan
Jyothi Gadda

|

Sep 29, 2022 | 3:50 PM

నగరంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన సర్వసాధారణం. కొందరు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తే, మరికొందరు తప్పించుకుంటారు. ఇలాంటి క్రమంలోనే ఓ వాహనదారుడు సిగ్నల్ జంప్ చేసి ఇంటికి వెళ్లగా.. నిబంధనలు ఉల్లంఘించిన విషయం అతడికి తెలిసింది. ఉల్లంఘించిన వ్యక్తి స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని షేర్‌ చేశాడు. అంతేకాదు..జరిమానా మొత్తాన్ని ముందుగానే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఈ ట్వీట్ చూసి స్థానిక పోలీసులే షాక్ అయ్యారు. ఈ విచిత్ర సంఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ట్రాఫిక్‌ నిబంధనలు మర్చిపోయి ఉల్లంఘించిన ఒక వాహనదారుడు..ఆ విషయాన్ని అతడు నిజాయితీగా బయటపెట్టాడు. బెంగళూరు నగరంలోని శాంతినగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్జెంట్ పని ఏదైనా ఉందో ఏమో తెలియదు గానీ, బాల కృష్ణ బిర్లా అనే వ్యక్తి శాంతినగర్ లో సిగ్నల్ జంప్ చేసి ఇంటికి వెళ్లాడు. ఆ సమయానికి అతడికి సిగ్నల్ జంప్ చేయడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించినట్టవుతుందని మర్చిపోయాడు..ఆ తర్వాత తేరుకుని విషయం గ్రహించాడు. దీనిపై బాల కృష్ణ బిర్లా.. క్షమాపణలు చెబుతూ జరిమానా చెల్లించేందుకు ముందుకు వచ్చారు. అంతే కాకుండా బాల కృష్ణ ట్రాఫిక్ పోలీసుల‌ను ట్యాగ్ చేస్తూ ప్రిలిమిన‌రీగా నేను ఫైన్ చెల్లించ‌నా అని ప్ర‌శ్నించాడు. ఈ ట్వీట్ చూసిన బెంగళూరు పోలీసులు అతని నిజాయితీని చూసి షాక్ అయ్యారు. అలాగే రీప్లే కూడా చాలా తెలివిగా ఇచ్చారు. ముందుగా జరిమానా చెల్లించవచ్చా అని బిర్లా అడిగిన ప్రశ్నకు పోలీసులు స్పందిస్తూ.. మేము నోటీసు ఇచ్చిన తర్వాత జరిమానా మొత్తాన్ని చెల్లించండి.

ఇవి కూడా చదవండి

Untitled 1

ఇంటికి నోటీసులు అందిన తర్వాత జరిమానా చెల్లించాలని పోలీసులు సూచించారు. అయితే బిర్లా సిగ్నల్ జంప్ చేసి ఉంటే అక్కడ సీసీ కెమెరా ఉందా? అతడు సిగ్నల్ జంప్ చేసిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయా లేదా ? అనేది ముందున్న ప్రశ్న. మొత్తానికి అతడు చేసిన ఈ ట్వీట్‌ మాత్రం నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అతడి ట్విట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu