AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీబ్రాలా నటిస్తూ అడవిలో షికారు.. అటాక్ చేసిన సింహాలు.. తర్వాత ఏం జరిగిందో ఊహించలేరు

ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు జీబ్రాలా తమని తాము మౌల్డ్ చేసుకొని అడవిలో తిరగడం మొదలు పెడతారు. కానీ, అడవిలో సింహాలు ఉంటాయని, అవి తమపై దాడి చేస్తే ఏం చేయాలో వారు అస్సలు ఊహించలేదు..

జీబ్రాలా నటిస్తూ అడవిలో షికారు.. అటాక్ చేసిన సింహాలు.. తర్వాత ఏం జరిగిందో ఊహించలేరు
Lioness Attack On Fake Zebr
Jyothi Gadda
|

Updated on: Sep 28, 2022 | 8:28 PM

Share

భూమిపై చాలా రకాల జంతువులు నివసిస్తున్నాయి. వాటిలో ప్రమాదకరమైన జంతువులు కూడా ఉన్నాయి. క్రూర జంతువుల జాబితాలో సింహం మొదటి స్థానంలో ఉంటుంది. సింహం కంటే భయంకరమైన, ప్రమాదకరమైన జంతువు భూమిపై మరొకటి లేదనే చెప్పాలి. ఇవి చాలా బలవంతమైనవే కాకుండా చాలా శక్తివంతమైనవి. తమ కంటే పెద్ద జంతవులను కూడా వేటాడి, చంపేసి ఆహారంగా మార్చుకోగలవు. ఇవి ఒక్కసారిగా దాడి చేస్తే ఎంతటి జంతువైనా మట్టికరవాల్సిందే. అలాంటి సింహంతో ఎదురుపడితే ఎలా ఉంటుంది. పై ప్రాణాలు పైకి పోవటం ఖాయమని చెప్పాల్సిందే. అలాంటిదే ఇక్కడ ఓ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. జంతువులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఫన్నీ వీడియో ప్రజలను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. మరి కొన్ని వీడియోలు ప్రజలను ఏడిపిస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యంగా సింహం, పులి, చిరుతపులి వంటి భయంకరమైన జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా షాకింగ్‌ ఉంటాయి. ఈ జంతువులు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఒకటిగా పరిగణించబడతాయి. ఇవి మనుషులను తినేవి. అందుకే మనుషులు వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అయినప్పటికీ, చాలా సార్లు ప్రజలు తమాషాగా కొన్ని తప్పులు చేసి ఇలాంటి భయంకరమైన జంతువుల బారిలో చిక్కుకుంటారు. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీ గుండె ఆగిపోయినంత పనవుతుంది.

ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు జీబ్రాలా తమని తాము మౌల్డ్ చేసుకొని అడవిలో తిరగడం మొదలు పెడతారు. కానీ, అడవిలో సింహాలు ఉంటాయని, అవి తమపై దాడి చేస్తే ఏం చేయాలో వారు అస్సలు ఊహించలేదు.. జీబ్రా వంటి చర్మాలు ధరించి ఇద్దరు వ్యక్తులు అడవిలో ఎలా తిరుగుతున్నారో వీడియోలో చూడవచ్చు. అతను నిజంగా జీబ్రాలా మారి వాటితో కలిసిపోవాలనుకున్నాడు. కానీ, జీబ్రాలు వాటిని చూసి పారిపోవటం ప్రారంభిస్తాయి. ఇంతలో అడవిలో తిరుగుతున్న అతనికి హఠాత్తుగా సింహం ఎదురైంది. అప్పుడు ఏం జరిగిందో ఊహించటానికే భయంవేస్తుంది. సింహం వాటిని నిజమైన జీబ్రాస్‌గా భావించి దాడికి యత్నించింది. అయితే, కష్టాల్లో ఉన్న తనను చూసి, అతను తన వేషం తీసేస్తాడు. అతడి అదృష్టం బాగుండి.. దాంతో సింహలు కూ తమకు మాంసం ముక్క దొరికినట్లు భావించి, కేవలం ఆ జీబ్రా చర్మంతో అక్కడి నుండి వెళ్లిపోయాయి. ఇలా ఆ ఇద్దరు తృటిలో తమ ప్రాణాలను కాపాడుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ షాకింగ్ వీడియో @closecalls7 అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. ఈ 36 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 1 లక్ష కంటే ఎక్కువ సార్లు వీక్షించారు, అయితే వేలాది మంది ప్రజలు వీడియోను లైక్ చేసారు మరియు వివిధ ప్రతిచర్యలు కూడా ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి