AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: హమ్మయ్య.. వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 11, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగా పెరుగుతుంది. వృథా ఖర్చులు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో శుభ వార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. మిథున రాశి వారు ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: హమ్మయ్య.. వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 11 March 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 11, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (మార్చి 11, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగా పెరుగుతుంది. వృథా ఖర్చులు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో శుభ వార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. మిథున రాశి వారు ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థికాభివృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలకు, కార్యక్రమాలకు ఇవి మంచి రోజులు. మాటకు సర్వత్రా విలువ పెరుగుతుంది. బంధుమిత్రుల్లో కూడా గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. వృథా ఖర్చులు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ప్రయత్నాలన్నీ సానుకూల ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆదాయ వృద్ధికి బాగా అవకాశముంది. అనవసర సహాయాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా కొనసాగుతుంది. ఆదాయ ప్రయత్నాలు, ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి పెడతారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కుటుంబ పరిస్థితులు బాగానే ఉంటాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల విషయంలో ఇతరులపై ఆధారపడకపోవడం మంచిది. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఇతరుల బాధ్యతలను నెత్తికెత్తుకోవద్దు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. పిల్లలు ఘనవిజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారమై, సామరస్యం ఏర్పడుతుంది. ఇరుగుపొరుగుతో వాదనలకు దిగవద్దు. కుటుంబ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. బంధువులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలను అభివృద్ది మార్గంలో నడిపిస్తారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అవనసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ పరిస్థితులు చాలావరకు ప్రశాంతంగా, సామరస్యంగా సాగుతాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. ఇష్టమైన ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో హోదా పెరగడానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న లాభాల్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటాయి. పొదుపు సూత్రాలు పాటించే అవకాశం ఉంది. రావాల్సిన సొమ్మును వసూలు చేసుకుంటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధువుల సాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్య క్రమాల్లో బిజీ అవుతారు. నిరుద్యోగులు ఆశించిన శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఏ విషయంలోనైనా సొంత నిర్ణయాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడక పోవడం మంచిది. ఇంటా బయటా అనుకూలతలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొనడం, ఆలయాల సందర్శన చేసుకోవడం వంటివి జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేసి లాభపడతారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యం జరిగే అవకాశముంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు తగిన సమాచారం అందుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో మీ ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఇంటా బయటా అనుకూలతలుంటాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. కొందరు బంధువుల నుంచి ఇబ్బందులు తలెత్తవచ్చు. తల్లితండ్రుల ఆరోగ్యం విషయంలో కాస్తంత శ్రద్ధ పెట్టడం మంచిది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు నెరవేరుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. మీ సమర్థతను నిరూపించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

Follow Us