Rajasthan Political Crisis: పోటీ చేయడం లేదు.. సోనియాను కలిసిన తర్వాత ప్రకటించిన అశోక్ గెహ్లాట్..
సోనియాగాంధీతో భేటీ తర్వాత ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు చర్చించారు. సోనియాతో భేటీ ముగిసిన తరువాత ఆయన ఈ ప్రకటన చేశారు.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కీలక ప్రకటక చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదని తేల్చి చెప్పారు. సోనియాగాంధీతో భేటీ తర్వాత ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు చర్చించారు. సోనియాతో భేటీ ముగిసిన తరువాత ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేస్తారా..? లేదా.. ? అన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. గెహ్లాట్ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు పార్టీలో తలెత్తిన అంతర్గత సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. పార్టీకి అంతర్గత క్రమశిక్షణ ఉందని.. సోనియాజీ ఆధ్వర్యంలో పార్టీలో క్రమశిక్షణ ఉందన్నారు.
“నేను ముఖ్యమంత్రిగా కొనసాగాలనుకుంటున్నాను. సోనియాగాంధీకి క్షమాపణలు చెప్పాను. గత 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయతతో పనిచేశాను. సోనియా గాంధీ ఆశీస్సులతో మూడోసారి సీఎం అయ్యాను.” ఇదిలావుంటే మీడియా ప్రతినిధులు అడిగిన మరో ప్రశ్నకు ఆయన దాటవేసే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా అని అడిగిన ప్రశ్నకు..” దీనిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలన్నారు.
అంతకుముందు, గెహ్లాట్‌కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) సమావేశాన్ని దాటవేసి, అసెంబ్లీ స్పీకర్ సిపి జోషికి తమ రాజీనామాలను సమర్పించారు. సిఎం పక్షాన ఉన్న శాసనసభ్యులు గళం వినిపించే ప్రయత్నం చేశారు.
పైలట్ శిబిరంలో ఉన్న వారు ఈ గొడవపై ఇంతవరకు బహిరంగంగా స్పందించలేదు. గెహ్లాట్ విధేయులైన శాంతి ధరివాల్, మహేశ్ జోషి, ధర్మేంద్ర రాథోడ్‌లకు కాంగ్రెస్ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది అధిష్టానం. సోనియా నివాసం బయట భారీ సంఖ్యలో అశోక్ గెహ్లాట్ మద్దతుదారులు చేరుకున్నారు. రాజస్థాన్ సీఎం పదవికి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెహ్లాట్ రాజీనామా చేయవద్దని నినాదాలు చేశారు.
I won’t contest these elections in this atmosphere, with moral responsibility, said Rajasthan CM Ashok Gehlot
On being asked if he will remain Rajasthan CM, Gehlot said, “I won’t decide that, Congress chief Sonia Gandhi will decide that.” pic.twitter.com/arRFlDrazd
— ANI (@ANI) September 29, 2022
Delhi | One-line resolution is our tradition. Unfortunately, a situation arose that resolution wasn’t passed. It was my moral responsibility, but despite being a CM I couldn’t get the resolution passed: Rajasthan CM Ashok Gehlot after meeting Sonia Gandhi https://t.co/anpX3MQXsG pic.twitter.com/r6dZhfud2I
— ANI (@ANI) September 29, 2022
గెహ్లాట్‌తో భేటీ ముగిసిన తరువాత సచిన్ పైలట్‌తో కూడా సోనియాగాంధీ సమావేశమవుతారు. గెహ్లాట్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తే తనకు సీఎం పదవి దక్కుతుందని గంపెడు ఆశతో ఉన్నారు సచిన్ పైలట్ . కాని ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లో సీఎం చేయవద్దని గెహ్లాట్ వర్గం డిమాండ్ చేస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తునట్టు ప్రకటించారు దిగ్విజయ్‌సింగ్. తాను నామినేషన్ పత్రాలను తీసుకోవడానికి ఢిల్లీకి వచ్చినట్టు తెలిపారు. రేపు కాంగ్రెస్ అధ్య క్ష పదవికి నామినేషన్ వేస్తునట్టు తెలిపారు. అయితే దిగ్విజయ్‌సింగ్ సొంతంగా నామినేషన్ వేస్తున్నారా ? లేక అధిష్టానం అండదండలు ఉన్నాయా ? అన్న విషయంపై క్లారిటీ లేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం