Telugu News India News Boat Carrying Nearly 100 People Capsizes in Assam’s Dhubri, Several Missing; Rescue Ops Underway
Assam Boat Accident: అసోంలో ఘోర ప్రమాదం.. బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా.. విద్యార్థులతో సహా 100 మంది గల్లంతు
ప్రమాద సమయంలో పాఠశాల విద్యార్థులతో సహా దాదాపు 100 మందితో ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు ఇచ్చని సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు గాలింపు చర్యలు చేపట్టాయి.
Assam Boat Accident: అసోంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దుబ్రీ దగ్గర బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో సుమారు 100 మంది ప్రయాణికులతో పడవ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 100 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన పడవలో ప్రభుత్వ అధికారి, పాఠశాల విద్యార్థులు సహా పలువురు ప్రయాణం చేస్తునట్టు తెలుస్తోంది. నదిలో గల్లంతైన వాళ్ల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దింపారు. ప్రమాద సమయంలో పాఠశాల విద్యార్థులతో సహా దాదాపు 100 మందితో ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు ఇచ్చని సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు గాలింపు చర్యలు చేపట్టాయి. పడవలో 10 మోటార్‌సైకిళ్లను కూడా ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
“దుబ్రి జిల్లాలోని బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా పడింది. రెస్క్యూ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టాయని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్ఞానేంద్ర దేవ్ త్రిపాఠి తెలిపారు.
భాషాని వెళ్తున్న పడవ ధుబ్రి పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలోని అడబారి వద్ద వంతెన స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడిందని మరో అధికారి తెలిపారు.
15 మందిని రక్షించారు. స్కూల్ కు వెళ్లే విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు. ఇప్పటి వరకూ ఏ ఒక్క విద్యార్థి రక్షింపబడలేదు.
ధుబ్రి సర్కిల్ అధికారి సంజు దాస్, ల్యాండ్ రికార్డ్ అధికారి, కార్యాలయ సిబ్బంది కూడా కూడా వరదలలో కోతకు గురైన ప్రాంతాన్ని సర్వే చేయడానికి పడవలో ప్రయాణిస్తున్నారు. వీరిలో దాస్ ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. అయితే మరో ఇద్దరు అధికారులు సురక్షితంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.