Lottery Winner: లాటరీలో గెలిచిన పాతిక కోట్లు తనకొద్దు అంటున్న విజేత.. రీజన్ ఇదే
రూ. 25 కోట్ల మొదటి బహుమతి విజేతగా ప్రకటించిన ఐదు రోజుల తర్వాత.. ఆటోరిక్షా డ్రైవర్ అనూప్ తాను బహుమతి ప్రకటించిన రెండు రోజులు చాలా సంతోష పడ్డానని.. అయితే ఇప్పుడు తాను ఎంతో చింతిస్తున్నట్లు చెప్పాడు. దీనికి రీజన్ తెలిస్తే షాక్ తింటారు.
Lottery Winner: డబ్బులు ఉన్నవారు వాటిని కాపాడుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తూ.. మనశాంతిని కూడా కోల్పోతారని.. తన ఆస్తులను, అంతస్తులను కాపాడుకోవడానికి కనీసం నిద్ర కూడా పోరని.. అదే పేదవారికి అయితే డబ్బులు ఎక్కడ దాచాలి.. ఎలా ఖర్చు చేయాలనే బాధలు ఉండవు కనుక.. హ్యాపీగా గడిపేస్తాడు అంటూ కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. అయితే ఒకొక్కసారి ఇటువంటివి నిజమేమో అనిపిస్తుంటాయి. తాజాగా కేరళలోని లాటరీని గెలిచిన ఓ అదృష్టశాలి పరిస్థితి. కేరళ ప్రముఖ పండగ ఓనం సందర్భంగా ఓ ఆటో డ్రైవర్ వార్తల్లో నిలిచాడు. అతడి పేరు.. సర్వత్రా వినిపిస్తోంది. ఇటీవల కేరళ ప్రభుత్వం నిర్వహించిన మెగా ఓనం రాఫిల్‌లో రూ. 25 కోట్ల బహుమతిని పొందిన భాగ్యశాలి అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. రూ. 25 కోట్ల మొదటి బహుమతి విజేతగా ప్రకటించిన ఐదు రోజుల తర్వాత.. ఆటోరిక్షా డ్రైవర్ అనూప్ తాను బహుమతి ప్రకటించిన రెండు రోజులు చాలా సంతోష పడ్డానని.. అయితే ఇప్పుడు తాను ఎంతో చింతిస్తున్నట్లు చెప్పాడు. దీనికి రీజన్ తెలిస్తే షాక్ తింటారు.
ఆటో డ్రైవర్ అనూప్ 25 కోట్ల రూపాయలను గెలుచుకున్నా.. పన్ను, ఇతర బకాయిలు అన్ని మినహాయింపులు తర్వాత ప్రైజ్ మనీగా రూ. 15 కోట్లు పొందుతాడు. అయితే ఇంత భారీ మొత్తంలో డబ్బులు రానుండడంతో తాను ఇప్పుడు మనశ్శాంతిని కోల్పొయానని చెపుతున్నాడు. కనీసం తన ఇంట్లో తాను నివసించే పరిస్థితి లేదని వాపోతున్నాడు. ఎందుకంటే నేను మొదటి బహుమతిని గెలుచున్న తర్వాత తన దగ్గరకు తమ అవసరాలను తీర్చమంటూ కోరుతున్న వారి సంఖ్య అధికం అయింది. మొదట్లో తనకు బహుమతి వచ్చినందుకు సంతోషంగానే ఉంది.. అయితే ఇప్పుడు తనకు బహుమతి వద్దనిపిస్తుందని అన్నాడు. అంతకు ముందు ఉన్న మనశ్శాంతి అంతా కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
కాగా తనకు ఇంకా డబ్బులు అందలేదని సోషల్ మీడియా ద్వారా అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం తాను డబ్బులను ఏమి చెయ్యాలో నిర్ణయించుకోలేదని.. రెండు ఏళ్ళు బ్యాంక్ లో వేస్తానని చెబుతున్నాడు. అంతేకాదు.. తనకొక కనీస అవసరాలు తీరే విధంగా తక్కువ మొత్తంలో డబ్బులు వచ్చినా బాగుండేదని, ప్రశాంతంగా ఉండేవాడినని అంటున్నాడు అనూప్. ఎందుకంటే డబ్భులు వచ్చాయని తెలియగానే తనకు తెలిసిన వారు చాలా మంది శత్రువులుగా మారే దశ ఇప్పుడు వచ్చిందని అనూప్ వాపోయాడు.
ఆటో డ్రైవర్ అనూప్ తన భార్య, బిడ్డ తల్లితో కలిసి కేరళ రాజధానికి 12 కిలోమీటర్ల దూరంలోని శ్రీకారియమ్‌లో నివసిస్తున్నాడు. అనూప్డ స్థానిక ఏజెంట్ నుండి లాటరీ టికెట్ ను కొనుగోలు చేశాడు. ఇటీవల ఆ లాటరీ టికెట్ కు మొదటి బహుమతి లభించిన సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..