Receptionist Murder Case: రిసార్టులో రిసెప్షనిస్ట్ హత్య.. బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరినీ..
రిసెప్షనిస్ట్ అంకిత భండారిని హత్య చేసిన తర్వాత నిందితుడు ఆమె మృతదేహాన్ని ఓ బ్యాగ్‌లో కుక్కి రిసార్ట్ సమీపంలోని కాలువలో విసిరేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
Receptionist Murder Case: ఉత్తరాఖండ్ రిసెప్షనిస్ట్ హత్య కేసు పెను దుమారం రేపుతుంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు, రిసార్టు ఓనర్ పుల్కిత్ ఆర్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా రిసార్టు మేనేజర్ సౌరభ్ భాస్కర్‌ను, రిసార్టు అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రిసార్టులో రిసెప్షనిస్ట్ గా పనిచేసే 19 ఏండ్ల యువతిని ఆ రిసార్టు ఓనర్ పుల్కిత్ ఆర్య.. రిసార్టు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్‌తో కలిసి హత్య చేసినట్లు తేలడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు యువతి మృతదేహం రిసార్ట్ సమీపంలో గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు.
రిసెప్షనిస్ట్ అంకిత భండారిని హత్య చేసిన తర్వాత నిందితుడు ఆమె మృతదేహాన్ని ఓ బ్యాగ్‌లో కుక్కి రిసార్ట్ సమీపంలోని కాలువలో విసిరేసినట్టుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కాల్వలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. ఓ ప్రైవేట్ రిసార్ట్ ఆవరణలో అదృశ్యమైన అంకితా భండారి మృతదేహాన్ని చిల్లా పవర్‌హౌస్ సమీపంలో పోలీసులు శనివారం ఉదయం గుర్తించారు. అటు, రిసెప్షనిస్ట్ హత్య తర్వాత పుల్కిత్ ఆర్యకు చెందిన రిసార్ట్‌పై దాడిచేశారు మృతురాలి బంధువులు, గ్రామస్తులు. యువతి మృతిపై ఆగ్రహించిన గ్రామస్తులు భవనానికి నిప్పుపెట్టారు.
WATCH | #AnkitaBhandari murder case: Locals set Vanatara resort in Rishikesh, Uttarakhand on fire.
The resort is owned by BJP leader Vinod Arya’s son Pulkit Arya. Three accused, including Pulkit, have been arrested in connection with the murder case. pic.twitter.com/7Zx0T6HJIB
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 24, 2022
మరోవైపు, ఈ క్రమంలోనే కేసులో ప్రధాన నిందితుడు పుల్కిత్ ఆర్య రాష్ట్రంలోని సీనియర్ బీజేపీ నాయకుడు వినోద్ ఆర్య కుమారుడు. వినోద్ ఆర్య గతంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. రిసెప్షనిస్ట్ హత్య కేసులో అతని కుమారుడు ప్రధాన నిందితుడిగా ఉండటంతో అధికార బీజేపీ వినోద్ ఆర్యపై పార్టీ బహిష్కరణ వేటు వేసింది. అతన్ని పార్టీ నుంచి తొలగించింది. పార్టీ సభ్యుడిగా ఉన్న పుల్కిత్ ఆర్య సోదరుడు అంకిత్ ఆర్యను కూడా బీజేపీ పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం ప్రకటించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి