Video: మరోమారు అదే దృశ్యం.. డ్రగ్స్‌ మత్తులో నడిరోడ్డుమీద యువకుడు.. పవిత్ర నగరంలో

విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న యువత ఆ మత్తులో మునిగితేలుతున్నారు. మరోవైపు పోలీసులు ప్రారంభించిన అనేక డి-అడిక్షన్ డ్రైవ్‌లు ఆశించిన ఫలితాలను ఇవ్వడంలో విఫలమయ్యాయనే విమర్శలు వ్యక్త మవుతున్నాయి.

Video: మరోమారు అదే దృశ్యం.. డ్రగ్స్‌ మత్తులో నడిరోడ్డుమీద యువకుడు.. పవిత్ర నగరంలో
Drugs Struggles
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 24, 2022 | 5:00 PM

Video: పంజాబ్‌ని పట్టిపీడిస్తు్న్న డ్రగ్స్‌ మత్తు వీడటం లేదు. విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న యువత ఆ మత్తులో మునిగితేలుతున్నారు. అమృత్‌సర్‌లోని మక్బూల్‌పురా ప్రాంతం డ్రగ్స్‌ బానిసలకు నిలయంగా మారుతోందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటీవలే ఒక యువతి డ్రగ్స్‌ మత్తులో రోడ్డుపై కనిపించటం కలకలం రేపింది. ఈ నెల ప్రారంభంలో మక్బూల్‌పురా ప్రాంతంలో ఒక యువతి రోడ్డుపై కదలడానికి కష్టపడుతున్న వీడియో ఆన్‌లైన్‌లో విస్తృతంగా చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు అమ్మాయి ఇప్పుడు అమృత్‌సర్‌లోని డి-అడిక్షన్ సెంటర్‌లో చేరింది. తాజాగా మరో వ్యక్తి డ్రగ్స్‌ ప్రభావం వల్ల రోడ్డుపై నడవలేని స్థితిలో అవస్థలుపడుతూ కనిపించాడు..అది కూడా సిక్కుల ప్రవిత్ర నగరమైన అమృత్‌సర్‌లో ఈ సంఘటన వెలుగుచూసింది.

చమ్రాంగ్ రోడ్డ్‌లో డ్రగ్స్‌ మత్తులో ఉన్న ఒక వ్యక్తి రోడ్డుపై తూలుతూ కదలలేని స్థితిలో ఉన్నాడు. స్థానికులు కొందరు అతని ప్రవర్తను వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు..అతడు డ్రగ్స్‌ ప్రభావంతో మత్తులో ఉన్నట్టుగా వారు పేర్కొన్నారు. ఇప్పుడు అదే వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.

సిక్కుల పవిత్ర నగరమైన మక్బూల్‌పురా, మాదకద్రవ్యాల దుర్వినియోగానికి సంబంధించిన సంఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. మరోవైపు పోలీసులు ప్రారంభించిన అనేక డి-అడిక్షన్ డ్రైవ్‌లు ఆశించిన ఫలితాలను ఇవ్వడంలో విఫలమయ్యాయనే విమర్శలు వ్యక్త మవుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో కనీసం 350 మంది డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారం రోజుల పాటు జరిపిన దాడుల్లో 6.90 కేజీల హెరాయిన్, 14.41 కేజీల నల్లమందు, 5 కేజీల గంజాయి, 6.44 క్వింటాళ్ల గసగసాలు, 2.10 లక్షల మాత్రలు, క్యాప్సూల్స్, ఇంజక్షన్లు, ఫార్మా ఓపియాయిడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్గాలతో పాటు డ్రగ్స్ ప్రభావిత ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ల తర్వాత ₹ 4.81 లక్షల మాదక ద్రవ్యం స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి