SBI: కస్టమర్లను మరోసారి హెచ్చరించిన ఎస్‌బీఐ.. లేకపోతే తీవ్రంగా నష్టపోవాల్సిందే..!

SBI: దేశంలోని కోట్లాది మంది బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నారు. అదే సమయంలో అనేక సార్లు చాలా మంది బ్యాంకింగ్ మోసానికి గురవుతుంటారు..

SBI: కస్టమర్లను మరోసారి హెచ్చరించిన ఎస్‌బీఐ.. లేకపోతే తీవ్రంగా నష్టపోవాల్సిందే..!
Sbi
Follow us
Subhash Goud

|

Updated on: Sep 24, 2022 | 5:02 PM

SBI: దేశంలోని కోట్లాది మంది బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నారు. అదే సమయంలో అనేక సార్లు చాలా మంది బ్యాంకింగ్ మోసానికి గురవుతుంటారు. దీని కోసం బ్యాంక్ ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు అవగాహన కల్పిస్తుంటుంది. అయినప్పటికీ, సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఎలాంటి బ్యాంకింగ్ మోసం జరిగినా వెంటనే తమకు తెలియజేయాలని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ కుమార్‌ ఖరా తెలిపారు. ఈ సమాచారం ఆలస్యంగా ఇస్తే, బ్యాంకు ఖాతాదారులు కూడా చాలా నష్టపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

కస్టమర్లు అనధికార లావాదేవీలను వెంటనే రిపోర్ట్ చేయాలని, తద్వారా సకాలంలో చెక్ చేసుకోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సూచిస్తోంది. దీంతో పాటు దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కస్టమర్ సర్వీస్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌పై బ్యాంకు ఖాతాదారులు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.

ఈ నంబర్‌కు తెలియజేయండి:

ఇవి కూడా చదవండి

ఏదైనా అనధికార లావాదేవీలు జరిగితే, టోల్ ఫ్రీ నంబర్ 18001-2-3-4కు తెలియజేయాలి.. తద్వారా సకాలంలో తగిన చర్యలు తీసుకోవచ్చు అని ఎస్‌బీఐ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బ్యాంకు వివిధ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలలో యోనో యాప్, ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా బ్యాంక్ కస్టమర్లకు ఉన్నత స్థాయి సేవలను అందజేస్తోందని తెలియజేసింది.

మోసపోవద్దు

వినియోగదారులకు ఎలాంటి లింక్‌లు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో వాటిని క్లిక్‌ చేయవద్దని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తెలిపింది. అదే సమయంలో వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు, బ్యాంకు సిబ్బంది వినియోగదారులకు ఫోన్‌లు చేసి వివరాలు ఎప్పుడూ అడగరని గుర్తించుకోవాలని, ఎవరు ఫోన్‌ చేసి వివరాలు అడిగినా చెప్పవద్దని ఎస్‌బీఐ హెచ్చరించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి