PM Kisan: పీఎం కిసాన్‌ రైతులకు అలర్ట్‌.. వీరికి 12వ విడత రూ. 2000 అందవు.. కారణం ఏంటో తెలుసుకోండి

PM Kisan Samman Yojana: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతులకు ఆసరాగా ఉండేందుకు వివిధ రకాల..

PM Kisan: పీఎం కిసాన్‌ రైతులకు అలర్ట్‌.. వీరికి 12వ విడత రూ. 2000 అందవు.. కారణం ఏంటో తెలుసుకోండి
Pm Kisan
Follow us
Subhash Goud

|

Updated on: Sep 23, 2022 | 7:25 PM

PM Kisan Samman Yojana: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతులకు ఆసరాగా ఉండేందుకు వివిధ రకాల పెట్టుబడి పథకాల ద్వారా మంచి రాబడిపొందే విధంగా రూపొందిస్తోంది కేంద్రం. ఇక రైతులకు మోడీ సర్కార్‌ ప్రవేశపెట్టిన పథకాల్లో కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ ఒకటి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Yojana 12th Installment Status) కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి. ఈ పథకం కింద ఇప్పటి వరకు 11 వాయిదాలు రైతుల ఖాతాల్లోకి జమ అయిన విషయం తెలసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆసరాగా ఉండేందుకు ఈ స్కీమ్‌ కింద సంవత్సరానికి 6 వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు కూడా ఉన్నారు. కొందరికి వారి అకౌంట్లోకి ఈ పథకం ద్వారా డబ్బులు రావడం లేదు. దరఖాస్తు చేసుకునే సమయంలో కొన్ని తప్పులు దొర్లడం కారణంగా డబ్బులు నిలిచిపోతున్నారు.

అయితే పీఎం కిసాన్ యోజన ప్రయోజనాల కింద కోట్లాది దరఖాస్తులు కేంద్ర ప్రభుత్వానికి వస్తాయి. అయితే వాటిలో చాలా తప్పులు ఉన్నాయి. దీని కారణంగా రైతుల వాయిదాలు ఆగిపోయాయి. బ్యాంక్ వివరాల నుండి ఇతర వివరాల వరకు తప్పులు ఉన్నాయి. అందుకే అలాంటి రైతులకు డబ్బులు రావడం లేదు. ఒక్కోసారి పేర్లు తప్పుగా, ఒక్కోసారి ఆధార్ కార్డుతో వివరాలు సరిపోలడం లేదు. ఇలాంటి కారణాల వల్ల రైతులు ప్రయోజనం పొందడం లేదు. అందుకే దరఖాస్తు చేసే సమయంలో అన్ని వివరాలు సరిగ్గా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

రైతు ఫారమ్ నింపేటప్పుడు మీ పేరును ఆంగ్లంలో రాయండి. దరఖాస్తులో హిందీలో పేరు ఉన్న రైతులు ఇంగ్లీషులో చేయాలి. అలాగే అప్లికేషన్‌లోని పేరు, బ్యాంక్ ఖాతాలోని దరఖాస్తుదారు పేరు వేర్వేరుగా ఉంటే మీ డబ్బు నిలిచిపోయే అవకాశం ఉంది. బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సి కోడ్, బ్యాంకు ఖాతా నంబర్, గ్రామం పేరు రాయడంలో పొరపాటు జరిగినా మీకు పీఎం కిసాన్‌ ఇన్‌స్టాల్‌మెంట్ మీ ఖాతాలో జమ చేయబడదు. ఇటీవల బ్యాంకుల విలీనం కారణంగా IFSC కోడ్‌లు మారాయి. అందుకే దరఖాస్తుదారు తన కొత్త IFSC కోడ్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఈ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ తప్పుగా రాయడం వల్ల కూడా డబ్బులు అందే అవకాశం ఉండదు. అందుకే రైతులు దరఖాస్తు చేసే సమయంలో జాగ్రత్తగా వివరాలను పూరించాలి.

ఇవి కూడా చదవండి

తప్పులను ఎలా సరిదిద్దాలి.. 

1. తప్పులను సరిదిద్దుకోవడానికి, ముందుగా మీరు pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి. 2. ఇప్పుడు ‘ఫార్మర్స్ కార్నర్’ ఎంపికను ఎంచుకోండి. 3. ఇక్కడ మీరు ‘ఆధార్ సవరణ’ ఎంపిక కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్‌లో సవరణలు చేసుకోవచ్చు. 5. మీరు మీ బ్యాంక్ ఖాతా నంబర్‌లో పొరపాటు ఉంటే దానిని సరిదిద్దడానికి మీరు వ్యవసాయ శాఖ కార్యాలయం లేదా బ్యాంకు అకౌంటెంట్‌ను సంప్రదించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి