Train Ticket Booking: ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా సులభంగా రైలు టికెట్లు.. గేట్‌వే రుసుము మినహాయింపు

SBI YONO Train Ticket Booking: మీరు కూడా పండుగ సీజన్‌లో రైళ్లలో ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే.. సులభంగా రైలు టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. స్టేట్‌ బ్యాంక్‌..

Train Ticket Booking: ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా సులభంగా రైలు టికెట్లు.. గేట్‌వే రుసుము మినహాయింపు
Sbi Yono
Follow us
Subhash Goud

|

Updated on: Sep 23, 2022 | 7:06 PM

SBI YONO Train Ticket Booking: మీరు కూడా పండుగ సీజన్‌లో రైళ్లలో ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే.. సులభంగా రైలు టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) యోనో (YONO) యాప్ నుండి సులభంగా రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మరి రైలు టికెట్లను సులభంగా ఎలా బుక్‌ చేసుకోవాలో తెలుసుకుందాం.

స్టేట్‌ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. యోనో యాప్ ద్వారా రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడం ద్వారా చౌక టిక్కెట్లను పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. SBI YONO యాప్ ద్వారా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సైట్‌లో రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకునే కస్టమర్‌లు ఎలాంటి పేమెంట్ గేట్‌వే ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. యోనో యాప్ ద్వారా టిక్కెట్ల కొనుగోలుపై పేమెంట్ గేట్‌వే రుసుము మినహాయించబడుతుందని ఎస్‌బీఐ తెలిపింది.

IRCTC వెబ్‌సైట్‌లో రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి మీకు చెల్లిస్తున్నప్పుడు వివిధ పేమెంట్ గేట్‌వే కంపెనీలు మీకు రూ.30 వరకు వసూలు చేస్తున్నాయి. మీరు SBI YONO యాప్ ద్వారా ఈ టిక్కెట్‌ను కొనుగోలు చేస్తే ఎలాంటి రుసుము ఉండదు.

SBI యోనో 2.0 యాప్ లాంచ్

SBI తన ఖాతాదారులకు ఒకే యాప్‌లో అన్ని బ్యాంకింగ్, లావాదేవీ సౌకర్యాలను అందించడానికి YONO యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇది మొదట 2017లో ప్రారంభించబడింది. తరువాత ఈ యాప్‌కు మరికొన్ని ఫీచర్లను జోడించడం ద్వారా YONO 2.0 యాప్ ప్రారంభించబడింది. ఈ యాప్ ద్వారా రుణ దరఖాస్తులు, డబ్బు లావాదేవీలు మరియు చెక్‌బుక్ లేదా కార్డ్ సంబంధిత సేవలను పొందవచ్చు.

టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఈ దశలను అనుసరించండి

☛ ముందుగా SBI YONO యాప్‌ని తెరిచి బుక్ అండ్‌ ఆర్డర్ విభాగానికి వెళ్లండి.

☛ ఇందులో మీకు IRCTC చిహ్నం కనిపిస్తుంది.

☛ దీన్ని క్లిక్ చేసిన తర్వాత, IRCTC లాగిన్ పేజీ తెరవబడుతుంది.

☛ దానిపై సృష్టించబడిన మీ IDతో లాగిన్ చేయండి, టిక్కెట్లను బుక్ చేయడానికి అవసరమైన మొత్తం సమాచారాన్ని పూరించండి.

☛ దీని తర్వాత, మీరు చెల్లింపు పేజీకి వెళ్లి మీ కార్డ్ లేదా బ్యాంక్ ఖాతా వివరాలను పూరించడం ద్వారా చెల్లించాలి.

యాప్‌లో టికెట్ కోసం చెల్లిస్తున్నప్పుడు, SBI మీకు పేమెంట్ గేట్‌వే ఛార్జీలను వసూలు చేయడం లేదని అక్కడ కనిపిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి