RBI Repo Rates: ఆర్బీఐ మళ్లీ వడ్డీ రేట్లను పెంచనుందా..? పెరగనున్న ఈఎంఐ.. నిపుణుల అంచనాలేంటి?
RBI Repo Rates: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో సాధారణ ప్రజలకు మరో పెద్ద..
RBI Repo Rates: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో సాధారణ ప్రజలకు మరో పెద్ద దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 30న వెలువడనుంది. ఈసారి కూడా ఆర్‌బీఐ వరుసగా నాలుగోసారి రెపో రేటును పెంచవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
వడ్డీ రేట్ల పెరుగుదల ఎంత కావచ్చు
వడ్డీ రేట్లు పెరిగిన తర్వాత మీ EMI కూడా పెరుగుతుంది. వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచవచ్చు. ఈసారి ప్రభుత్వం 35 బేసిస్ పాయింట్ల వరకు పెరగవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో 50 బేసిస్ పాయింట్లను కూడా పెంచవచ్చని కొందరు భావిస్తున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య సమీక్ష విధానం సమావేశం
సెప్టెంబర్ 28న ప్రారంభమవుతుంది. దీంతో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనే దానిపై 30న వెల్లడించనుంది ఆర్బీఐ. దేశంలో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం 7 శాతం స్థాయిలో ఉండగా, ఇదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఇప్పటివరకు 1.40 బేసిస్ పాయింట్లు పెంచింది. దీని తరువాత ద్రవ్యోల్బణం తగ్గడానికి బదులుగా, అది మరింత పెరుగుతోంది. ఈసారి కూడా రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచితే దాని ప్రత్యక్ష ప్రభావం దేశాభివృద్ధిపై పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
అమెరికాలో కూడా వడ్డీరేట్లు పెరిగాయి:
ఫెడ్ రిజర్వ్ ఇటీవల అమెరికాలో వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈసారి అమెరికాలో 75 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఈ నిర్ణయం ప్రభావం రూపాయి కూడా తొలిసారిగా 81 స్థాయిని దాటింది. అంతే కాకుండా దేశంలో ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి