Smart Phones: బెస్ట్ ఫొటో ఫీచర్ ఫోన్స్ కోసం వెతుకున్నారా.. టెన్షన్ లేకుండా ఈ మోడల్స్ పై ఓ లుక్కేయండి..
పండుగల సీజన్ సమీపిస్తోంది. బతుకమ్మ, దేవీ శరన్నవరాత్రులు, విజయదశమి, దీపావళి పండుగలు ఒకదాని తర్వాత మరొకటి క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు పండుగ షాపింగ్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు....
పండుగల సీజన్ సమీపిస్తోంది. బతుకమ్మ, దేవీ శరన్నవరాత్రులు, విజయదశమి, దీపావళి పండుగలు ఒకదాని తర్వాత మరొకటి క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు పండుగ షాపింగ్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని ఈ కామర్స్ సైట్స్ భారీ తగ్గింపు ప్రకటిస్తున్నాయి. స్పెషల్ డీల్స్ అంటూ ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నాయి. వారు ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఫోన్ కెమెరాను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో కామర్స్ సైట్స్ అందిస్తున్న ఆఫర్లను అందుకుంటూ.. మంచి కెమెరా క్వాలిటీ కలిగిన ఫోన్ల వివరాలను ఇక్కడ మీకు అందిస్తున్నాం. ఓ సారి వీటిని పరిశీలించి.. నచ్చితే హాయిగా కొనుగోలు చేసేయొచ్చు.
realme C33- రూ. 8,999
తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన కెమెరా పనితీరు కావాలనుకునే వారు realme C33 ను కొనుగోలు చేయొచ్చు. 50MP AI ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. C33 మంచి ఫొటోలను అందించడానికి మంచి ఆప్షన్. 5,000 mAh బ్యాటరీ, 88.7% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 6.5” డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మూడు రంగుల్లో లభిస్తుంది – శాండీ గోల్డ్, ఆక్వా బ్లూ, నైట్ సీ 3+32 GB ధర రూ. 8,999, 4+64 GB ధర రూ. 9,999.
Redmi 10A- రూ. 8,499
మీలోని ఫోటోగ్రాఫర్‌ను బయటకు తీసేందుకు ఇది మరొక గొప్ప ఎంపిక. 13MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ స్పష్టమైన వివరాలతో చిత్రాలు తీయడంలో గొప్పగా పని చేస్తుంది. 5,000 mAh బ్యాటరీ, 12.5, 6.53-అంగుళాల IPS డిస్‌ప్లే ఉన్నాయి. Redmi 10A మూడు రంగులలో లభిస్తుంది – సీ బ్లూ, స్లేట్ గ్రే, చార్‌కోల్ బ్లాక్, రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. 3+32GB రూ. 8,499, 4+64GB రూ. 9,499.
లావా బ్లేజ్- రూ. 8,699
ఇది 13MP ట్రిపుల్ AI ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. నైట్ మోడ్, బ్యూటీ, పోర్ట్రెయిట్, మాక్రో మోడ్‌లు ఇలా 8 విభిన్న షూటింగ్ మోడ్‌లతో చక్కగా రూపొందించబడింది. కెమెరా సెటప్ మీలోని కళాకారుడిని అన్వేషించడానికి ఉపయోగపడేలా ఉంటుంది. 5,000 mAh బ్యాటరీ, 6.5-అంగుళాల HD+ IPS డిస్‌ప్లేతో పనిచేస్తుంది. లావా బ్లేజ్ నాలుగు రంగుల్లో లభిస్తుంది. గ్లాస్ బ్లాక్, గ్లాస్ గ్రీన్, గ్లాస్ రెడ్, గ్లాస్ బ్లూతో 3+3 GB RAM, 64GB ROM రూ. 8,699.
Moto E40- రూ. 9,499
8MP సెల్ఫీ కెమెరా, 48MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఉన్న ఫోన్ ఇది. అద్భుతమైన క్వాలిటీస్ తో ఫొటో తీయడంలో మీలో దాగున్న సృజనాత్మకతను ఇది బయటకు తెస్తుంది. మంచి లుక్ తో పాటు 5,000 mAh బ్యాటరీ, 6.6-అంగుళాల మాక్స్ విజన్ HD+ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది రెండు రంగుల్లో లభిస్తుంది. కార్బన్ గ్రే, పింక్ క్లే. 4+64GB వేరియంట్‌లో రూ. 9,499. ఇది అధికారిక వెబ్‌సైట్ Motorola.in తో పాటు Flipkartలో అందుబాటులో ఉంది.