AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Jodo Yatra: అలుపెరగని యాత్ర.. నేడు కేరళ నుంచి తమిళనాడులోకి ఎంట్రీ.. ఆదరణకు రాహల్ గాంధీ కృతజ్ఞతలు

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మలప్పురంలోని నిలంబూరులోని చుంగతారా నుంచి యాత్ర ప్రారంభమైంది. గురువారం..

Bharat Jodo Yatra: అలుపెరగని యాత్ర.. నేడు కేరళ నుంచి తమిళనాడులోకి ఎంట్రీ.. ఆదరణకు రాహల్ గాంధీ కృతజ్ఞతలు
Bharat Jodo Yatra
Ganesh Mudavath
|

Updated on: Sep 29, 2022 | 1:49 PM

Share

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మలప్పురంలోని నిలంబూరులోని చుంగతారా నుంచి యాత్ర ప్రారంభమైంది. గురువారం 8.6 కి.మీల మేర ప్రయాణించిన తర్వాత కేరళ, తమిళనాడు సరిహద్దు వద్ద తమిళనాడులోకి యాత్ర ఎంటర్ కానుంది. గూడలూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకున్న తర్వాత సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. దాదాపు 5.5 కిలోమీటర్లు సాగి గూడలూరు బస్టాండ్ వద్ద ఆగిపోతుంది. కొన్ని రోజుల క్రితం మరణించిన దివంగత సీనియర్ పార్టీ నాయకుడు ఆర్యదన్ మహమ్మద్‌ను రాహుల్ గాంధీ స్మరించుకున్నారు. ఆయన ఇప్పుడు తనతో లేకపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం కోసం, రాష్ట్రం కోసం అవిశ్రాంతంగా పనిచేసిన ఆర్యదాన్ మహ్మద్ సేవలను మిస్ అవుతున్నట్లు వాపోయారు. వాయనాడ్‌లో పెద్ద సంఖ్యలో జనసమూహాన్ని ఉద్దేశించి, యాత్ర ముగింపులో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రెండో ఇంటి నుంచి యాత్రను ముగించడం ఆనందంగా ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రకు మీరు అందించిన హృదయపూర్వక ఆదరణకు వయనాడ్ ధన్యవాదాలు తెలిపారు.

కాగా.. భారత్‌ జోడో యాత్రలో భావోద్వేగ పూరిత సంఘటన జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ను చూసి ఓ యువతి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ ఘటన సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 18వ రోజు కేరళలోని పండిక్కాడ్‌లోని స్కూల్‌ వద్ద ఉదయం పాదయాత్ర మొదలైంది. వండూరు జంక్షన్‌లో విరామం కోసం ఆగిన సమయంలో రాహుల్‌ గాంధీ వద్దకు ఓ యువతి వచ్చింది. రాహుల్‌ను చూసిన ఆనందంలో చిన్నపిల్లలా గెంతులు వేసింది. భావోద్వేగంతో ఏడుపును ఆపుకోలేక పోయింది. రాహుల్‌ మాత్రం ఆ యువతి భావోద్వేగాన్ని కంట్రోల్‌ చేస్తూ ఆమెను దగ్గరకు తీసుకుని సముదాయించారు. ఇలాంటి క్రేజీ ఫీలింగ్‌ రాహుల్‌ గాంధీ పాదయాత్రలో ఎదురవ్వడం విశేషం.

మరోవైపు.. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 21వ రోజుకు చేరుకుంది. సెప్టెంబరు 10న తమిళనాడు నుంచి కేరళలో ప్రవేశించిన ఈ యాత్ర అక్టోబరు 1న కర్ణాటకకు చేరనున్నది. 19 రోజుల వ్యవధిలో ఏడు జిల్లాల మీదుగా 450 కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలో భారత్‌ జోడో యాత్ర సాగనున్నది. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్‌ జోడో యాత్ర 150 రోజుల పాటు జరగనుంది. సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర.. జమ్మూ కశ్మీర్‌లో ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..