AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇంటింటికీ సురక్షిత మంచినీరు.. తెలంగాణ సిగలో మరో కలికితురాయి.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు..

తెలంగాణ సిగలో మరో పురస్కారం అలరించబోతోంది. స్వచ్ఛమైన నీటిని మారుమూల పల్లెల్లో సరఫరా చేస్తున్నందుకు గాను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పంచాయితీ రాజ్‌కి ఈ అవార్డును ప్రకటించింది. అత్యధికంగా మారుమూల..

Telangana: ఇంటింటికీ సురక్షిత మంచినీరు.. తెలంగాణ సిగలో మరో కలికితురాయి.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు..
Mission Bhagiratha
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 29, 2022 | 7:29 AM

తెలంగాణ సిగలో మరో పురస్కారం అలరించబోతోంది. స్వచ్ఛమైన నీటిని మారుమూల పల్లెల్లో సరఫరా చేస్తున్నందుకు గాను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పంచాయితీ రాజ్‌కి ఈ అవార్డును ప్రకటించింది. అత్యధికంగా మారుమూల గ్రామాలకు సురక్షిత జలాలను అందించే ఏకైక రాష్ట్రంగా ఎన్నికైన తెలంగాణకు జల్‌ జీవన్‌ మిషన్‌ ఈ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన బృందానికీ ఢిల్లీ నుంచి ఆహ్వానం లభించింది. గాంధీ జయంతి రోజున భారత రాష్ట్రపతి ముర్ము.. ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. స్వచ్ఛమైన మంచినీటి సరఫరాలో ఇప్పటికే తెలంగాణ పలు అవార్డులను కైవసం చేసుకుంది. దేశంలో నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షిత మంచినీటిని అందిస్తోన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. దేశంలో నూటికి నూరు శాతం ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా కూడా తెలంగాణకు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా దేశంలో మంచినీటి సరఫరాలో అత్యుత్తమ, అద్భుత ప్రతిభ కనపరిచిన రాష్ట్రంగా తెలంగాణని ఈ అవార్డు వరించింది.

ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షిత మంచి నీటిని అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఆయన బృందాన్ని, ప్రజా ప్రతినిధులను, అధికారులను, గ్రామ కార్యదర్శులు, సిబ్బందిని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందించారు. అక్టోబర్‌ 2 గాంధీ జయంతి రోజున తెలంగాణ రాష్ట్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 అవార్డులను అందుకోనుంది. ఈ అవార్డులను స్వీకరించేందుకు రాష్ట్రం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లనుంది.

నల్లా నీటిని అందించడంలో ఆదర్శమైన పనితీరును కనపర్చిందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన జీవనానికి నీటి సరఫరా ఎంతో తోడ్పడుతుందని ఆశిస్త్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. మిషన్‌ భగీరథ ద్వారా రాష్ట్రంలోని మారుమూల అటవీ, కొండ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ తాగునీరు అందుతోందని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్రం హర్షం వ్యక్తం చేసింది. ఈ పథకం అమలుతీరును ఇటీవల జల్‌ జీవన్‌ మిషన్‌ స్వయంగా పరిశీలించింది. 320 గ్రామాల్లో స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీలు నిర్వహించి, నీటి నాణ్యత, సరఫరా తీరును పరిశీలించింది.

ఇవి కూడా చదవండి

ఇంటింటికి స్వచ్ఛమైన మంచి నీటిని అందించే మిషన్‌ భగీరథకు మూలం సీఎం కేసీఆరేనని మంత్రి దయాకర్ రావు అన్నారు. ఈ అవార్డు ఘనత ఆయనదేనని వెల్లడించారు. భగీరథలో కృషి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి అభినందనలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం