కర్నూలు జిల్లాలో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. ఎమ్మిగనూరు మార్కెట్లో 25 కిలోల టమాటా బాక్స్ కేవలం 50 రూపాయలకు చేరడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గిట్టుబాటు ధర లేక, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తమ పంటను రోడ్డుపై పారబోసి గొర్రెలకు మేతగా వేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి టమాటాను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.