PFI: పిఎఫ్ఐ నిషేధంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు.. కేంద్రం నిర్ణయంపై ఏమన్నారంటే..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎఫ్ ఐ కేసులో చివరికి.. ఆసంస్థపై నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రప్రభుత్వ నిర్ణయంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత..

PFI: పిఎఫ్ఐ నిషేధంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు.. కేంద్రం నిర్ణయంపై ఏమన్నారంటే..
Mim Asaduddin Owaisi
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 28, 2022 | 9:19 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎఫ్ ఐ కేసులో చివరికి.. ఆసంస్థపై నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రప్రభుత్వ నిర్ణయంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. పిఎఫ్ఐ సంస్థకు తన మద్దతు ఏనాడూ ఉండబోదన్న ఆయన.. కేంద్రప్రభుత్వం విధించిన నిషేధం సమర్థించదగింది కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఎఫ్ఐ విధానాలను మొదటి నుంచి తాను వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ విధానాన్ని సమర్ధిస్తూనే ఉన్నానని, ఇప్పుడు పిఎఫ్ఐపై విధించిన నిషేధాన్ని మాత్రం సమర్థించబోను అని ఆయన పేర్కొన్నారు. పిఎఫ్ఐ నిషేధించబడింది. కానీ, ఖాజా అజ్మేరీ బాంబు పేలుళ్ల దోషులతో సంబంధం ఉన్న సంస్థలు ఎందుకు నిషేధించబడలేదు.. కేంద్ర ప్రభుత్వం మితవాద మెజారిటీ సంస్థలను ఎందుకు నిషేధించడం లేదంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అసదుద్దీన్ ఒవైసీ.

యూఏపీఏ సవరణను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌, బీజేపీలపై ఆయన మండిపడ్డారు. యూఏపీఏకు కాంగ్రెస్‌ సవరణ చేస్తే.. బీజేపీ ప్రభుత్వం దానిని మరింత క్రూరంగా మార్చేసిందన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ దానికి మద్దతు తెలిపింది అని విమర్శించారు. ఈ రకమైన కఠినమైన నిషేధం ప్రమాదకరమన్న ఆయన.. ఇది తన అభిప్రాయాన్ని చెప్పాలనుకునే ముస్లింలపై నిషేధం అని పేర్కొన్నారు. భారతదేశపు క్రూరమైన నల్ల చట్టం యుఎపిఎ కింద ఇప్పుడు ప్రతి ముస్లిం యువకుడిని.. పిఎఫ్ఐ కరపత్రంతో అరెస్టు చేస్తారని అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇలా ఉండగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్ఐ)పై కేంద్ర హోంశాఖ కఠిన ఆంక్షలు విధించిందన విషయం తెలిసిందే. పిఎఫ్ఐను చట్ట వ్యతిరేక సంస్థగా గుర్తిస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. దేశవ్యాప్తంగా ఇటీవల పిఎఫ్ఐ కార్యాలయాలపై దాడులు జరుగుతూ వచ్చాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు తేలడమే కాకుండా.. ప్రధాని మోదీ లక్ష్యంగా ఈ సంస్థ పనిచేసినట్టు అధికారులు గుర్తించారు. మంగళవారం కూడా కర్నాటక వ్యాప్తంగా ఏకాలంలో మెరుపు దాడులు చేసిన అధికారులు.. 80 మంది పీఎఫ్ఐ నాయకులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయా జిల్లా, తాలూకాల న్యాయమూర్తుల దగ్గర వారిని హాజరు పరిచి కారాగారాలకు తరలించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించడం, ప్రత్యర్థులపై దాడులకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలను పరిగణలోనికి తీసుకున్న కేంద్రం.. పిఎఫ్ఐని చట్ట వ్యతిరేక సంస్థగా గుర్తించింది. కేంద్రప్రభుత్వ నిర్ణయంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ తాను నిషేధాన్ని సమర్థించడం లేదన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..