Bharat Jodo Yatra: రాహుల్ గాంధీని చూసి ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా.. హత్తుకొని ఓదార్చిన యువనేత.. నెట్టింట్లో వీడియో హల్ చల్

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి అనేక అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ యాత్రలో చాలా మంది మహిళలు యువనేతను కలిసి తమ సమస్యలను చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే చాలా మంది..

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీని చూసి ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా.. హత్తుకొని ఓదార్చిన యువనేత.. నెట్టింట్లో వీడియో హల్ చల్
Rahul Gandhi
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 28, 2022 | 8:33 PM

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి అనేక అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ యాత్రలో చాలా మంది మహిళలు యువనేతను కలిసి తమ సమస్యలను చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే చాలా మంది అమ్మాయిలు కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగస్వాములు అవుతున్నారు. కొద్దిరోజుల క్రితం తమిళనాడులో యాత్ర సాగుతున్నప్పుడు రాహుల్ గాంధీకి పెళ్లిప్రతిపాదన కూడా వచ్చింది. ఈవిషయం అప్పట్లో నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు రాహుల్ గాంధీని కలిసి తమ సమస్యలు విన్నవించుకున్న సందర్భంలో ఓ మహిళ రాహుల్ గాంధీ తమిళనాడుని ప్రేమిస్తున్నాడనే విషయం తమకు తెలుసని, అతడికి తమిళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మహిళ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ చిరునవ్వులు చిందించి ఎటువంటి సమాధానం ఇవ్వకుండానే ముందుకు సాగిన విషయం తెలిసిందే.

తాజాగా కేరళలో రాహుల్ గాంధీకి మరో అనుభవం ఎదురైంది. సెప్టెంబర్ 28వ తేదీ బుధవారం రాహుల్ గాంధీ పాదయాత్ర కేరళలోని పండిక్కాడ్‌ స్కూల్‌ పాడి నుంచి ప్రారంభమైంది. ఉదయం వండూరు జంక్షన్‌లో విరామం కోసం కొద్దిసేపు ఆగారు. అదే సమయంలో పాదయాత్రలో అనుకోకుండా ఓ యువతి ప్రత్యక్షమై రాహుల్ గాంధీని చూసి ఎగిరి గెంతులేసింది. అంతటితో ఆగకుండా రాహుల్ గాంధీని చూసి ఏడ్వడం మొదలుపెట్టింది. ఆయువతిని గమనించిన రాహుల్ గాంధీ అమ్మాయిని దగ్గరకు తీసుకుని హత్తుకొని ఓదార్చారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. భారత్ జోడో యాత్రలో బుధవారం రాహుల్ గాంధీని కలిశానన్న ఆనందంతో ఎగిరి గెంతేయడంతో పాటు వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆ అమ్మాయి రాహుల్‌ గాంధీని చూసి భావోద్వేగంతో ఏడుపుని ఆపుకోలేకపోయింది. ఆ యాత్రలో పాల్గొన్న వాళ్లంతా ఆ యవతి చర్యలను చూసి ఆశ్చర్యంతో నవ్వుతుండగా..రాహుల్‌ ఆ యువతని దగ్గరకు తీసుకుని సముదాయించారు.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి  పాప్‌ సింగర్స్‌ లేదా హిరో, హిరోయిన్‌లు వచ్చినప్పుడూ అభిమానులు ఇలా ప్రవర్తిస్తుంటారు. కానీ అలాంటి క్రేజీ ఫీలింగ్‌ రాహుల్‌గాంధీకి ఈ పాదయాత్రలో ఎదురైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. మరోవైపు కేరళలో కొనసాగుతున్న భారత్ జోడో పాదయాత్ర ఈరోజు రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సుమారు 3,750 కిలోమీటర్ల మేర కొనసాగనున్న పాదయాత్ర సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. జమ్ము కాశ్మీర్ వరకు ఈయాత్ర కొనసాగనుంది. సెప్టెంబర్ 10వ తేదీన కేరళలో ప్రవేశించిన భారత్ జోడో పాదయాత్ర అక్టోబర్ 1నాటికి కర్ణాటకలోకి ప్రవేశించనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..