Weather: మరో రెండు రోజులు వర్షాలే.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. ఆ జిల్లాలకు అలర్ట్..
తెలంగాణలో మూడు రోజులగా కురుస్తున్న వర్షాలు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు...
తెలంగాణలో మూడు రోజులగా కురుస్తున్న వర్షాలు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు ప్రైమరీ వార్నింగ్ కూడా ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తాజాగా ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని తెలిపారు. దీనికి తోడు.. అండమాన్ సముద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ తీరం వరకు బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తులో ఉందని పేర్కొన్నారు. అంతే కాకుండా రాష్ట్రంపై నైరుతి రుతుపవనాలు చురుకుగా కదలడం వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. కాగా.. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయ్. ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌తో అనేక జిల్లాలు అతలాకుతలమవుతున్నాయ్. రాయలసీమ, దాని చుట్టుపక్కల జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. గంటో లేక అరగంటో ఉన్నట్టుండి కురుస్తున్న కుంభ వృష్టితో లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఉరుములు మెరుపులతో కురిసిన జోరువానకు గుంటూరు నగరం అల్లాడిపోయింది. ప్రధాన రహదారులన్నీ మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. ఇక నంద్యాల జిల్లా అంతటా వర్ష బీభత్సం కొనసాగింది. నంద్యాలతో పాటు కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో కురిసిన వర్షానికి వరద నీరు ముంచెత్తింది. కడప జిల్లా బద్వేల్‌లోనూ కుండపోత వర్షం కురిసింది. దాంతో, ప్రధాన రహదారులు నీట మునిగాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు ప్రజలు.
నెల్లూరు జిల్లాలోనూ భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కావలి హైవే పైకి వరద నీరు పోటెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలకు పంటలు కూడా దెబ్బతింటున్నాయి. పంట పొలాలు నీట మునగడంతో దిక్కతోచని స్థితిలో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం