Ponniyin Selvan 1: మణిరత్నం సినిమా కోసం ఫస్ట్ ఛాయిస్‌గా స్టార్ హీరోలు.. వీళ్లేవరంటే.!
సినిమా ఇండస్ట్రీలో మణిరత్నం సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు. ఆయన సినిమాల్లో ఎదో మ్యాజిక్ ఉంటుంది. రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు మంచి విజయాలను అందుకుంటాయి.
సినిమా ఇండస్ట్రీలో మణిరత్నం సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు. ఆయన సినిమాల్లో ఎదో మ్యాజిక్ ఉంటుంది. రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు మంచి విజయాలను అందుకుంటాయి. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన మణిరత్నం ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.వేల నాటి చోళుల కథాంశంతో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాని రూపొందించారు మణిరత్నం. ప్రసిద్ధ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఈ సినిమాకు ఆధారం. రెండు భాగాలుగా ఈ సినిమాను తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ మూవీ పై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాలో కరికాలన్‌గా విక్రమ్.. అరుణ్ మోళి వర్మన్‌గా జయం రవి.. వల్లవరాయన్ వాందివదేవన్‌గా కార్తి.. నందినిగా ఐశ్వర్యారాయ్.. కుందవై పిరిత్తియార్‌గా త్రిష నటిస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోలుగా అనుకున్నది వేరే వారినట. అయితే ముందుగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాలో మహేష్ బాబు, దళపతి విజయ్ లను ఈ సినిమా కోసం అనుకున్నారట. కరికలాన్ విక్రమ్ ప్లేస్‌లో దళపతి విజయ్‌ను, వల్లవరాయన్ వాందివదేవన్ కార్తి ప్లేస్ సూపర్ స్టార్ మహేష్ ను తీసుకోవాలని అనుకున్నారట మణిరత్నం.
అయితే మహేష్, విజయ్ తమ సినిమాలతో బిజీ అవ్వడంతో ఈ కాంబినేషన్ సెట్ అవ్వలేదట. ‘పొన్నియన్ సెల్వన్ 1’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పొన్నియన్ సెల్వన్ ను లైకా ప్రొడక్షన్స్, మణిరత్నం మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
Initially #ThalapathyVijay was supposed to play as #VandiyaThevan character & #ChiyaanVikram as #AdithaKarikalan ! Writer Jeyamohan pic.twitter.com/RdUqlDpzzB
— Wαlk-Mαn Ajíth (@WalkMan_Ajith) September 8, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..