Adipurush: ఆదిపురుష్ నుంచి క్రేజీ ఆప్డేట్.. రాముడిగా ప్రభాస్ లుక్ అదుర్స్ ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు డార్లింగ్.

Adipurush: ఆదిపురుష్ నుంచి క్రేజీ ఆప్డేట్.. రాముడిగా ప్రభాస్ లుక్ అదుర్స్ ..
Adipurush
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 30, 2022 | 10:01 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు డార్లింగ్. కానీ సినిమా ఫ్యాన్స్ ను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఆదిపురుష్ గా రానున్నాడు ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‏తో రూపొందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

అయితే ఈ సినిమా షూటింగ్ గతంలోనే పూర్తైనప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయకపోడవంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా టీజర్ అక్టోబర్ 2న అయోధ్యలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమానుంచి టీజర్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో ప్రభాస్ విల్లు ఆకాశానికి ఎక్కుపెట్టి కనిపించారు. ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఈ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమా టైటిల్ కింద చేడు పై మంచి సాధించిన విజయం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఆదిపురుష్ టీజర్ లాంచ్ వేడుకకు ప్రభాస్, కృతి సనన్ హజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీతగా కృతిసనన్, లంకేశ్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.