Karthikeya 2: ఇట్స్ అఫిషియల్.. కార్తికేయ 2 ఓటీడీ డేట్ వచ్చేసిందోచ్.. స్ట్రీమింగ్ ఆరోజు నుంచే
Karthikeya 2 OTT Release: ఆగస్ట్ 13న విడుదలైన ఈ చిన్న సినిమా సౌత్‌తో పాటు నార్త్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఉత్తరాది నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Karthikeya 2 OTT Release: యూత్ స్టార్ నిఖిల్ సిద్ధార్థ్.. అందాల అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2 . డైరెక్టర్ చందూ మోండేటి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో విడుదలై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఆగస్ట్ 13న విడుదలైన ఈ చిన్న సినిమా సౌత్‌తో పాటు నార్త్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఉత్తరాది నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. వందకోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఓవర్సీస్‌లోనూ 1.5మిలియన్ కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇక ఈ సినిమాతో దేశవ్యాప్తంగా నిఖిల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోన్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు సినీప్రియులు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది.
కార్తికేయ 2 సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ స్టూడియోస్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈనేపథ్యంలో దసరా కానుకగా అక్టోబర్5న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సినిమా స్పెషల్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసింది. కాగా ఇంతకుముందు కూడా అక్టోబర్ 5న జీ5లో కార్తికేయ 2 స్ట్రీమింగ్ అంటూ వచ్చి పలు పోస్టులను హీరో నిఖిల్ లైక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరి థియేటర్లలో ఈ సూపర్‌హిట్ సినిమాను మిస్ అవుతున్నవారు ఎంచెక్కా ఇంట్లోనే కూర్చోని ఆస్వాదించండి.
An official trailer, only for y’all!
The epic saga of this mysterious adventure continues with this Blockbuster World Digital Premiere #Karthikeya2OnZee5✨@actor_Nikhil @anupamahere @Srinivasa43 @harshachemudu @AnupamPKher @bhairavudu#karthikeya2 #ChoostuneUndipotaaru pic.twitter.com/nHZPgTGJmv
— ZEE5 Telugu (@ZEE5Telugu) September 29, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..