Mahesh Babu Daughter: మిస్‌ యూ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి నానమ్మ.. మళ్లీ ఎమోషనలైన సితార

బుధవారం సాయంత్రం ఇందిరా దేవి అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆమెను తలుచుకుంటూ మహేశ్‌, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్టులు పెట్టారు. అలాగే కూతురు సితార కూడా భావోద్వేగ పోస్ట్‌ షేర్‌ చేసిం

Mahesh Babu Daughter: మిస్‌ యూ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి నానమ్మ.. మళ్లీ ఎమోషనలైన సితార
Mahesh Babu Daughter
Follow us
Basha Shek

|

Updated on: Sep 29, 2022 | 10:24 AM

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం (సెప్టెంబర్‌ 28) అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మరణంతో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరీ ముఖ్యంగా నానమ్మను తలుచుకుంటూ సితార ఆమె పార్థివ దేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యం అందరినీ కలిచివేసింది. కూతురు ఏడుస్తుంట్ మహేశ్‌ దంపతులు ఆమెను ఓదార్చడం అందరి హృదయాలను బరువెక్కించింది. కాగా బుధవారం సాయంత్రం ఇందిరా దేవి అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆమెను తలుచుకుంటూ మహేశ్‌, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్టులు పెట్టారు. అలాగే కూతురు సితార కూడా భావోద్వేగ పోస్ట్‌ షేర్‌ చేసింది. నానమ్మ, సోదరుడు గౌతమ్‌తో ఉన్న ఫొటోను పంచుకుంటూ ‘మిస్‌ యూ సో మచ్‌ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నా’ అని ఎమోషనలైంది. దీనికి హార్ట్‌ బ్రేకింగ్‌ ఎమోజీని జత చేసింది.

కాగా నానమ్మను కోల్పోయిన చిట్టితల్లి పడుతున్న ఆవేదన అందరి మనసులను కలచివేస్తోంది. సితారకు తన నానమ్మతో చాలా ఎమోషనల్ బాండింగ్‌ ఉంది. ఏ పండగొచ్చినా కచ్చితంగా బామ్మ దగ్గరకు వెళ్తుంది. రోజంతా అక్కడ సంతోషంగా గడుపుతుంది. ఇది చూసిన ఇందిరాదేవి ఎంతగానో మురిసిపోయేవారు. నా కుమారుడివి పర్‌ఫెక్ట్‌ కూతురిని నువ్వు అంటూ.. సితారను ఎంతో మురిపెంగా చూసుకునేవారు. అలాగే మహేష్‌ తన కూతురికి సితార అని పేరు పెట్టినప్పుడు కూడా చాలా సంతోషంతో అందరికీ చాలా గొప్పగా చెప్పుకున్నారని సన్నిహితులు చెబుతారు. కాగా సితార రీసెంట్‌గా సర్కారు వారి పాట ప్రమోషన్‌లో కనిపించింది. మనవరాలు ఇలా కనిపించడం చూసి ఇందిర చాలా సంతోషపడ్డారు. సితార కూచిపూడి నేర్చుకుంది. అలాగే ఎప్పుడు నాన్నమ్మ ఇంటికి వెళ్లినా సంప్రదాయ బట్టల్లోనే వెళ్లేది. ఈ కూచిపూడి, సంప్రదాయ దుస్తులు అన్నీ కూడా నాన్నమ్మ మార్క్ అనే చెప్పాలి. అందుకే .. ఇద్దరి మధ్య అంతటి ఎమోషన్‌ బాండింగ్ ఉంది కాబట్టే సితార నానమ్మను మర్చిపోలేకపోతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..