Shocking Video: మొసలి నోటికి చిక్కిన తాబేలు.. చివరకు ఎలా బయటపడిందో మీరే చూడండి

Crocodile- Turtle :ఒక తాబేలు కూడా మొసలి నోటికి చిక్కింది. సాధారణంగా ఇవి నెమ్మదిగా నడుస్తాయి. మరి అలాంటి జంతువుమొసలి బారిన పడితే ఇంకేమైనా ఉందా? ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే తాబేలు మాత్రం బయటపడింది. అదెలాగంటే..

Shocking Video: మొసలి నోటికి చిక్కిన తాబేలు.. చివరకు ఎలా బయటపడిందో మీరే చూడండి
Crocodile Turtle
Follow us
Basha Shek

|

Updated on: Sep 28, 2022 | 10:41 AM

Crocodile- Turtle: మొసలి ఎంత ప్రమాదకరమైన జంతువులో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక నీటిలో ఉండే ఎలిగేటర్లు వెయ్యి ఏనుగుల బలంతో సమానం. వాటి బారిన పడిన జంతువులు ప్రాణాలతో బయటపడడం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. అందుకే ఎంత పెద్ద జంతువులైనా మొసలికి దూరంగా ఉంటాయి. ఈనేపథ్యంలో ఒక తాబేలు కూడా మొసలి నోటికి చిక్కింది. సాధారణంగా ఇవి నెమ్మదిగా నడుస్తాయి. మరి అలాంటి జంతువుమొసలి బారిన పడితే ఇంకేమైనా ఉందా? ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే తాబేలు మాత్రం బయటపడింది. అదెలాగంటే..

అప్పటికే ఆకలితో అల్లాడిపోయిన ఓ మొసలి చెరువు ఓడ్డుకు వచ్చింది. వేట కోసం వెతుకుతున్న క్రమంలో తాబేలు కంటపడింది. ఇక ఆపూటకు ఆహారం దొరికినట్లే అని భావించింది మొసలి. అదే సమయంలో మొసలిని చూసిన తాబేలు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే దానికున్న స్వభావం కారణంగా అది పరిగెత్తలేకపోయింది. అడుగులో అడుగు వేస్తూ వెళ్లేలోపే మొసలి నోటికి చిక్కింది. ఇదే అదనుగా తన పొడవాటి పదునైన పళ్లతో తాబేలును కొరికేందుకు ప్రయత్నించింది మొసలి. అయితే తాబేలు శరీరంపై ఉండే ధృడమైన పెంకు.. దానికి దేవుడిచ్చిన వరంలా మారిపోయింది. ఎంతో ధృడంగా ఉండే ఆ చిప్పను కొరకలేకపోయింది మొసలి. చాలాసార్లు ప్రయత్నించినా ఆ చిప్పను కొరలకలేకపోయింది. దీంతో నోటి నుంచి జారిపోయి బయటపడింది తాబేలు. వెంటనే బతకు జీవుడా అనుకుంటూ.. చిట్టి చిట్టి కాళ్లతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి ఈ వీడియో ఇప్పటిది కాదు. నాలుగేళ్ల క్రితమే యూబ్యూట్‌లో పోస్ట్ చేశారు. అమెరికా సౌత్ కరోలినాలోని హిల్టన్ హెడ్ ఐలాండ్‌లో ఈ ఘటన జరిగింది. అయితే కొందరు నెటిజన్లు మళ్లీ ఈ వీడియోను షేర్‌ చేస్తూ వైరల్‌గా మార్చుతున్నారు. discovery_wild_animal అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్‌ చేసిన ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వచ్చాయి. అలాగే లక్షలాది మంది లైకులు కురిపిస్తున్నారు. తాబేలు అదృష్టం బాగుంది. లేకపోతే మొసలికి ఆహారంగా మారేది అంటూ నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by @discovery_wild_animal_

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..