Viral Video: ఇంగ్లండ్‌పై క్లీన్‌స్వీప్‌.. పీపీఈ కిట్లతో టీమిండియా క్రికెటర్ల క్యాట్‌వాక్‌.. వైరలవుతోన్న వీడియో

IND W VS ENG W: టీమిండియా మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. మొదటిసారిగా ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించి 3-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Viral Video: ఇంగ్లండ్‌పై క్లీన్‌స్వీప్‌.. పీపీఈ కిట్లతో టీమిండియా క్రికెటర్ల క్యాట్‌వాక్‌.. వైరలవుతోన్న వీడియో
India Women Cricket Team
Follow us
Basha Shek

|

Updated on: Sep 27, 2022 | 7:10 PM

IND W VS ENG W: టీమిండియా మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. మొదటిసారిగా ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించి 3-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన ఝులన్ గోస్వామికి హర్మన్‌ ప్రీత్ సేన ఘనమైన వీడ్కోలు అందించినట్లయింది. కాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌ తర్వాత హర్మన్‌ సేనకు ఇప్పుడిప్పుడే మ్యాచ్‌లు లేవు. వన్డే వరల్డ్‌కప్‌- 2023తోనే మళ్లీ టీమిండియా మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. కాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌ పూర్తయిన తర్వాత స్వదేశానికి తిరుగుపయనమైన టీమిండియా మహిళా క్రికెటర్లు లండన్‌ ఎయిర్‌పోర్టులో పీపీఈ కిట్లతో క్యాట్‌వాక్‌ చేశారు. జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు ఝులన్‌ గోస్వామి, హర్లిన్‌ డియోల్‌ సహా ఇతర క్రికెటర్లు.. మోడల్స్‌ను అనుకరిస్తూ ర్యాంప్‌వాక్‌ చేశారు. అనంతరం తమ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలను జెమీమా రోడ్రిగ్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.

కాగా స్వదేశానికి చేరుకున్న టీమిండియా మహిళా క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఝులన్‌ గోస్వామి, ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మలకు కోల్‌కతా విమానాశ్రయంలో అభిమానులు సాదర స్వాగతం పలికారు. కాగా ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేలో ఆఖర్లో దీప్తిశర్మ.. ఇంగ్లండ్‌ బ్యాటర్‌ చార్లీ డీన్‌ను మన్కడింగ్‌ చేయడం తీవ్ర చర్చనీయాంశమయింది. మ్యాచ్‌ ఓడిపోవడంతో చార్లీ డీన్‌ కన్నీటిపర్యంతమైన సంగతి తెలిసిందే. దీంతో దీప్తి శర్మ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఆడిందంటూ ఇంగ్లండ్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆమెపై విమర్శలు చేశారు. ఇదే సమయంలో దీప్తి నిబంధనలకు అనుగుణంగానే మన్కడింగ్‌ చేసిందంటూ చాలామంది క్రికెటర్లు, ప్రముఖులు టీమిండియా క్రికెటర్‌కు మద్దతు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?