IND vs SA Match Preview: డెత్‌ ఓవర్ల గండం నుంచి టీమిండియా గట్టేక్కేనా? నేడు సఫారీలతో మొదటి టీ20 మ్యాచ్‌

India vs South Africa: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల టీ20 సిరీస్‌ గెలుపుతో టీమిండియా జోరుమీదుంది. అదే జోష్‌లో సౌతాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలివన్డేలో బరిలోకి దిగనుంది.

IND vs SA Match Preview: డెత్‌ ఓవర్ల గండం నుంచి టీమిండియా గట్టేక్కేనా? నేడు సఫారీలతో మొదటి టీ20 మ్యాచ్‌
India Vs South Africa
Follow us
Basha Shek

|

Updated on: Sep 28, 2022 | 9:30 AM

India vs South Africa: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల టీ20 సిరీస్‌ గెలుపుతో టీమిండియా జోరుమీదుంది. అదే జోష్‌లో సౌతాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలివన్డేలో బరిలోకి దిగనుంది. ఇప్పటికే టీమిండియా ప్లేయర్లు కేరళలోని తిరువననంతపురానికి చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కాగా ఆసియా కప్-2022 వైఫల్యంతో భారత క్రికెట్ జట్టులోని సమస్యలన్నీ బయటపడ్డాయి. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో టీమిండియా బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈలోపాలను అధిగమించడానికి పటిష్ఠమైన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లు వినియోగించుకోవాలనుకుంది. అందుకు తగ్గట్లే మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఉండవచ్చు కానీ డెత్‌ ఓవర్ల సమస్య తొలగిపోలేదు. బుమ్రా, హర్షల్‌ పటేల్‌ జట్టులోకి వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో బౌలింగ్‌ సమస్యలను అధిగమించాలంటే దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీసే చివరి అవకాశం.

రాహుల్ రాణించేనా?

ఇవి కూడా చదవండి

కాగా ఆఖరి ఓవర్లలో బౌలర్లతో పాటు ఓపెనింగ్ జోడీ నుంచి కూడా పరుగులు రాకపోవడం భారత్‌కు ఇబ్బందిగా మారింది. మరోవైపు భారత్‌లో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ను కోల్పోలేదు. ఈనేపథ్యంలో సిరీస్‌ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. కాగా ఈ మ్యాచ్‌ కోసం త్రివేండ్రం చేరుకున్న టీమ్‌ఇండియాకు ప్రేక్షకులు ఘనస్వాగతం పలికారు. తిరువనంతపురంలోని హోటల్‌కు చేరుకున్న టీమిండియాకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. కాగా స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌ దక్షిణాఫ్రికాను ఓడించలేదు. ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు మ్యాచ్‌ల్లో ఇరు జట్లూ తమ బలహీనతలను తెలుసుకుని వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలని భావిస్తున్నాయి. కాగా ఓపెనర్‌ కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాపై పరుగులు చేయలేకపోయాడు. ఈ సిరీస్‌లోనైనా రాణించాలనుకుంటున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్‌లో ఉండటంతో రాహుల్ కూడా వేగంగా పరుగులు సాధించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాతో ఆడేందుకు దినేష్ కార్తీక్‌కు ఎనిమిది బంతులు మాత్రమే లభించగా, క్రీజులో ఎక్కువ సమయం ఇవ్వాలని రోహిత్ ఇప్పటికే చెప్పాడు. కాగా ప్రపంచకప్ జట్టులో చేరిన దీపక్ హుడా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను దింపవచ్చు.

భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.

దక్షిణాఫ్రికా:

టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, జార్న్ ఫార్చ్యూన్, రీజా హెండ్రిక్స్, హెన్రిక్ క్లాసెన్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్‌గిడి, ఎన్రిక్ నోర్కియా, వేన్ పార్నెల్, ఆండిల్ ఫెలుక్వాయోస్, డివే ప్రెనియోటోరియస్, , రిలే రోసో, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..