AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: మళ్లీ ఆస్పత్రికి వెళ్లిన స్టార్‌ హీరోయిన్‌.. డాక్టర్లు ఏమన్నారంటే?

ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురైంది. తీవ్ర అసౌకర్యం కలగడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరింది. ఆమె ఆస్పత్రిలో చేరిన వెంటనే పలు రకాల పరీక్షలు నిర్వహించారు వైద్యులు.

Deepika Padukone: మళ్లీ ఆస్పత్రికి వెళ్లిన స్టార్‌ హీరోయిన్‌.. డాక్టర్లు ఏమన్నారంటే?
Deepika Padukone
Basha Shek
|

Updated on: Sep 27, 2022 | 9:53 PM

Share

ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురైంది. తీవ్ర అసౌకర్యం కలగడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరింది. ఆమె ఆస్పత్రిలో చేరిన వెంటనే పలు రకాల పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రభాస్‌ మూవీ ప్రాజెక్ట్ కె షూటింగ్‌కు హాజరైంది దీపిక. ఆ సమయంలో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడంతో కామినేని ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆ సమయంలో తీవ్ర పని ఒత్తిడితో దీపిక ఆరోగ్యం దెబ్బతింది. కాగా కొన్ని నెలల క్రితం దీపికకు కరోనా సోకింది. కరోనాను అధిగమించిన తర్వాత, ఆమె యూరోపియన్ పర్యటనకు వెళ్లింది. యూరప్ నుంచి తిరిగొచ్చాక ప్రభాస్ తో షూటింగ్ స్టార్ట్ చేసింది. ఈ హెక్టిక్ వర్క్ షెడ్యూల్ తన రక్తపోటుపై ప్రభావం చూపిందని నిర్మాత అశ్వినీదత్ తెలియజేశారు.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తోన్న ప్రాజెక్ట్‌- కేలో బిగ్‌ బీ అమితాబ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతోపాటు షారుక్‌ ఖాన్‌ హీరోగా నటిస్తోన్న పఠాన్‌లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది దీపిక. ఈ సినిమాలో జాన్ అబ్రహం కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 25న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ హిందీ, తమిళ్‌, తెలుగు భాషల్లో విడుదల కానుంది. మరోవైపు హృతిక్ రోషన్ సరసన ఫైటర్ చిత్రంలోనూ దీపికనే హీరోయిన్‌గా నటించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?