Shriya saran: పెళ్లినాటి తీపి జ్ఞాపకాలు పంచుకున్న స్టార్‌ హీరోయిన్‌.. వైరలవుతోన్న ఫొటోలు

Shriya saran:  తాజాగా తన పెళ్లినాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుకుతెచ్చుకుంది శ్రియ. అప్పుడు వాళ్ల తల్లిదండ్రులతో కలిసి తీయించుకున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

Shriya saran: పెళ్లినాటి తీపి జ్ఞాపకాలు పంచుకున్న స్టార్‌ హీరోయిన్‌.. వైరలవుతోన్న ఫొటోలు
Shriya Saran
Follow us
Basha Shek

|

Updated on: Sep 27, 2022 | 4:24 PM

Shriya saran:  ఇష్టం సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రియా శరణ్‌ (Shriya saran). ఆ తర్వాత సంతోషం, నువ్వేనువ్వే, ఠాగూర్‌, నేనున్నాను వంటి హిట్‌ సినిమాలతో తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ లాంటి సీనియర్‌ హీరోలతో పాటు యువ హీరోలతోనూ ఆడిపాడిన ఘనత ఆమె సొంతం. ఇదిలా ఉంటే 2018లో రష్యా టెన్నిస్‌ ప్లేయర్‌ ఆండ్రీ కొశ్చీవ్‌ను రహస్యంగా ప్రేమ వివాహం చేసుకుందీ అందాల తార. 2021 జనవరిలో ఈ దంపతులకు ఓ ఆడకూతురు జన్మించింది. అయితే ఈ విషయాలన్నింటినీ గోప్యంగా ఉంచిందీ బ్యూటీ క్వీన్‌. తన పెళ్లి, కూతురు పుట్టిన విషయాన్ని 2021 అక్టోబర్‌లో కానీ బయటకు చెప్పలేదు. తాజాగా తన పెళ్లినాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుకుతెచ్చుకుంది శ్రియ. అప్పుడు వాళ్ల తల్లిదండ్రులతో కలిసి తీయించుకున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

కాగా శ్రియ తల్లిదండ్రుల పుట్టిన రోజు కావడంతో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది శ్రియ. ఈ సందర్భంగా తన పెళ్లితో వారితో దిగిన పలు ఫొటోలను షేర్‌ చేసుకుంది ‘ అమ్మా, నాన్న మీ ఇద్దరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ప్రపంచంలోనే ఉత్తమమైన తల్లిదండ్రలు. నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అని ఈ ఫొటోలకు క్యాప్షన్‌ ఇచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో చివరిగా కనిపించింది శ్రియ. ప్రస్తుతం హిందీలో అజయ్‌ దేవ్‌గణ్‌తో కలిసి ‘దృశ్యం2’లో నటిస్తోంది. దీంతోపాటు ఉపేంద్ర సినిమా కబ్జాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. వీటితో పాటు మ్యూజిక్‌ స్కూల్‌, తడ్కా, నాగసూరన్‌ తదితర సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..