Andhra Pradesh: కృష్ణా జిల్లాలో విషాదం.. పామును పట్టుకునేందుకు వెళ్లి.. అదే పాము కాటుకు బలి

Snake Bite: కృష్ణా జిల్లా కృత్తివెన్ను పంచాయతీ గుడిదిబ్బలో విషాదం చోటు చేసుకుంది. పుణ్యం చేయబోతే పాపం ఎదురైనట్లు తేలు, పాము కాట్లకు గురైన ఎంతోమందికి మంత్రంతో పునర్జన్మను అందించిన వ్యక్తే చివరకు పాముకాటుకు బలయ్యాడు.

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో విషాదం.. పామును పట్టుకునేందుకు వెళ్లి.. అదే పాము కాటుకు బలి
Snake Bite
Follow us
Basha Shek

|

Updated on: Sep 25, 2022 | 9:50 AM

Snake Bite: కృష్ణా జిల్లా కృత్తివెన్ను పంచాయతీ గుడిదిబ్బలో విషాదం చోటు చేసుకుంది. పుణ్యం చేయబోతే పాపం ఎదురైనట్లు తేలు, పాము కాట్లకు గురైన ఎంతోమందికి మంత్రంతో పునర్జన్మను అందించిన వ్యక్తే చివరకు పాముకాటుకు బలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. గుడిదిబ్బకు చెందిన దివంగత కొండూరి గోపాల కృష్ణశాస్ర్తి తన మంత్రంతో ఎంతోమంది తేలు, పాము కాటు బాధితులకు ప్రాణం పోశారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన పెద్ద కుమారుడు కొండూరి నాగబాబు (వేద పండితులు) కూడా పాము కాటుకు మంత్రం వేస్తుంటారు. హైదరాబాద్‌లో స్థిరపడినప్పటికీ, తరచూ ఇక్కడికి వచ్చి పౌరోహిత్యం, పూజలు, పాముకాటుకు వైద్యం వంటి సేవలందిస్తున్నారు. ఆ చుట్టు పక్కల గ్రామంలో ఎక్కడ పాములున్నా వాటిని పట్టుకుని సురక్షితంగా వేరే చోట విడిచిపెడతారు. ఈ క్రమంలో.. శనివారం ఉదయం మండల పరిధిలోని పీతలావలోని ఓగోడౌన్‌లో పాము ప్రవేశించిందని సమాచారం అందగా వెంటనే అక్కడకు వెళ్లారు.

కాగా తాచు పామును పట్టుకొనే క్రమంలో దురుదృష్టవశాత్తూ అది నాగబాబును కాటేసింది. అయినప్పటికీ పామును పట్టుకుని వేరే చోట వదిలిపెట్టాడు. ఆ తర్వాత నాగబాబును బంధువులు వెంటనే చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. ఎందరినో పాము కాటు నుంచి కాపాడిన వ్యక్తే అదే పాము కాటుకు బలి కావడంతో స్థానికులు నాగబాబు కుటుంబీకులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా సకాలంలో వైద్యం అందకపోవడంతోనే నాగబాబు మృతిచెందాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
ఆదివారం రోజు ఈ నివారణలు చేయండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ఆదివారం రోజు ఈ నివారణలు చేయండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!
ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?