AP Crime News: ‘తాతా..! మా అమ్మ గొంతును ఇదిగో.. ఇలా నొక్కి నాన్నే చంపేశాడు’ మూడేళ్ల చిన్నారి మాటలతో కేసులో కీలక మలుపు..
బిడ్డ నల్లగా పుట్టిందనే కారణంతో ఓ దుర్మార్గుడు భార్యపై అనుమానం పెంచుకుని.. బిడ్డ కళ్ల ఎందుటే భార్యను హత మార్చాడు. అనంతరం అనారోగ్యం కారణంగా మరణించిందని నమ్మబలికాడు. అందరూ సహజంగా మరణించిందనే అనుకున్నారు. ఐతే ఊహించని విధంగా చేసిన పాపం..
Man Arrested After 3 year girl Tells whole story to Police: బిడ్డ నల్లగా పుట్టిందనే కారణంతో ఓ దుర్మార్గుడు భార్యపై అనుమానం పెంచుకుని.. బిడ్డ కళ్ల ఎందుటే భార్యను హత మార్చాడు. అనంతరం అనారోగ్యం కారణంగా మరణించిందని నమ్మబలికాడు. అందరూ సహజంగా మరణించిందనే అనుకున్నారు. ఐతే ఊహించని విధంగా చేసిన పాపం కన్నబిడ్డ నోటి వెంట బయట పడటంతో కటకటాల పాలయ్యాడు సదరు భర్త. పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం…
ఒరిస్సాలోని నవరంగపూర్ సిటీ పరిధిలోని సిలాటిగావ్ గ్రామానికి చెందిన మాణిక్ ఘోష్‌కు కారాగావ్ గ్రామానికి చెందిన లిపికా మండల్ (22)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహానంతరం ఉద్యోగ నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీలోని కాకినాడకు వలస వెళ్లారు. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కిందట కూతురు (మహి) జన్మించింది. ఐతే కూతురు నల్లన ఛాయతో ఉండటంతో లిపికాపై మాణిక్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై వారిద్దరూ తరచూ గొడవపడేవాళ్లు. ఈ క్రమంలో జనవరిలో మరోసారి భార్యభర్తల మధ్య గొడవ తలెత్తడంతో లిపికా అలిగి పుట్టింటికి వెళ్లింది. అత్తమామలు లిపికా పుట్టింటికి వెళ్లి, ఆమెకు సర్దిచెప్పి కాకినాడకు కాపురానికి పంపారు. ఐతే సెప్టెంబర్ 18న రాత్రి లిపికాకు మూర్ఛ వచ్చింది. దీంతో భర్త మాణిక్ అంబులెన్సుకు ఫోన్ చేసి, భార్యను అందులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు లిపికాను పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. మృతురాలి మెడపై కమిలిన గుర్తులు కనిపించడంతో ఆసుపత్రి సిబ్బంది కాకినాడ పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లిపికా తల్లిదండ్రులు మంగళవారం కాకినాడ వెళ్లి, చిన్నారి మహిని కారాగావ్ తీసుకెళ్లారు. ఆ తర్వాత తల్లి ఏ విధంగా చనిపోయిందో తెలుసుకునేందుకు చిన్నారి తాత ప్రశ్నించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. నాన్న.. అమ్మగొంతును రెండు చేతులతో పట్టుకుని నొక్కాడు. అమ్మ కాళ్లు చేతులు కొట్టుకుంది. కొంచెం సేపయ్యాక కదలకుండా పడుకుందని’ వచ్చీరాని మాటలతో మహి తాను చూసిన సంఘటనను తాతతకు వివరించి చెప్పింది. విషయం తెలుసుకున్న తాత తపన్ మండల్ సెప్టెంబర్ 24న మహితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులకు కూడా తల్లి మరణం గురించి తెల్పడంతో.. పోలీసులు నిందితుడు మాణిక్‌ను అరెస్టు చేసి, విచారించగా నేరం అంగీకరించాడు. మహి నల్లగా పుట్టిందనే కారణంతో అనుమానం పెంచుకని, తన భార్యను హతమార్చినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.