Viral Video: ఆవుపై పెంపుడు కుక్క దాడి.. కర్రతో కొట్టినా కూడా విడిచిపెట్టని వైనం.. నెట్టింట షాకింగ్ వీడియో

Shocking Video: ఇటీవల దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు అధికమయ్యాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ విచక్షణ రహితంగా కరిచేస్తున్నాయి.

Viral Video: ఆవుపై పెంపుడు కుక్క దాడి.. కర్రతో కొట్టినా కూడా విడిచిపెట్టని వైనం.. నెట్టింట షాకింగ్ వీడియో
Dog Attack
Follow us
Basha Shek

|

Updated on: Sep 24, 2022 | 10:40 AM

Shocking Video: ఇటీవల దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు అధికమయ్యాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ విచక్షణ రహితంగా కరిచేస్తున్నాయి. వీధి కుక్కల దాడులను భరించలేని కేరళ ప్రభుత్వం వీటిని చంపేందుకు అనుమతులివ్వాలని ఏకంగా హైకోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లో ఓ కుక్క ఆవుపై దాడికి దిగింది. ఆవు దవడను నోటితో బలంగా పట్టుకుని కరిచింది. దీంతో ఆవుకు తీవ్రగాయాలయ్యాయి. అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే ఈ దాడికి పాల్పడింది ఒక పెంపుడు కుక్క. కాన్పూర్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇందులో పిట్‌ బుల్‌ జాతికి చెందిన ఓ పెంపుడు కుక్క ఆవుపై విచక్షణారహింతంగా దాడికి తెగబడింది. ఆవు దవడను తన నోటితో కరిచి పట్టుకుంది. దీంతో ఆవు నొప్పికి తాళలేక మెలికలు తిరిగిపోయింది. ఆవును రక్షించడానికి కుక్క యజమాని తీవ్రంగా ప్రయత్నించాడు. మొదట చేతులు, ఆ తర్వాత కర్రతో కుక్కను బాదాడు. అయినా ఆ కుక్కు ఆవును ఎంతకూ వదిలి పెట్టలేదు. ఇదే సమయంలో ఆవైపు వెళుతున్న మరో ముగ్గురు వచ్చి కుక్క బారి నుంచి ఆవును కాపాడారు. అయితే అప్పటికే ఆవు నోటికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో మున్సిపల్‌ అధికారులు రంగంలోకి దిగారు. కుక్క పెంచుకోవడానికి లైసెన్స్‌ చూపించాల్సిందిగా యాజమానిని ఆదేశించారు. పొగరుబోతు కుక్కను కూడా అదుపులోకి తీసుకుని బోనులో ఉంచారు. తీవ్రంగా గాయపడిన ఆవును పశువైద్యశాలకు తీసుకెళ్లారు. ముందు జాగ్రత్త చర్యగా ఆవుకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు మెడికల్ ఆఫీసర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!