AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagababu-Niharika: నాగబాబుకు గాయం.. నేను నయం చేస్తానన్న నిహారిక.. తండ్రీకూతుళ్ల బాండింగ్‌కు ఫ్యాన్స్‌ ఫిదా

మెగా బ్రదర్‌ నాగబాబు (Nagababu), ఆయన గారాల పట్టి నిహారిక (Niharika)ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రీకూతుళ్లైనప్పటికీ ఫ్రెండ్స్‌లా ఒకరితో ఒకరు ఎంతో సరదాగా ఉంటారు.

Nagababu-Niharika: నాగబాబుకు గాయం.. నేను నయం చేస్తానన్న నిహారిక.. తండ్రీకూతుళ్ల బాండింగ్‌కు ఫ్యాన్స్‌ ఫిదా
Nagababu Niharika
Basha Shek
|

Updated on: Sep 23, 2022 | 12:31 PM

Share

మెగా బ్రదర్‌ నాగబాబు (Nagababu), ఆయన గారాల పట్టి నిహారిక (Niharika)ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రీకూతుళ్లైనప్పటికీ ఫ్రెండ్స్‌లా ఒకరితో ఒకరు ఎంతో సరదాగా ఉంటారు. ఈనేపథ్యంలో వీరిద్దరి బాండింగ్‌కు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అభిమానులు ఈ వీడియోను చూసి తెగ మురిసిపోతున్నారు. ఈ వీడియోలో నాగబాబు చేతికి కట్టుతో కనిపించారు. అయితే అదే సమయంలో పక్కన కూర్చున్న మెగా డాటర్‌ తండ్రి గడ్డాన్ని నిమురుతూ.. ‘ నొప్పిగా ఉందా నాన్న.. ఆ నొప్పి నేను తీసేయనా’ అని అంటుంది. దీనికి ‘పెద్ద పెద్ద డాక్టర్ల వల్లే కాలేదు.. నీ వల్ల ఏమౌతుంది’ అని రిప్లై ఇచ్చాడు నాగబాబు. ‘లేదు.. లేదు.. నేను తీసేస్తా అంటున్నా కదా.. ఆ నొప్పి తీసేస్తా’ అంటూ నిహా తండ్రి చేయిని పట్టుకుని గట్టిగా కొరికింది. ఆ నొప్పి తాళలేక నాగబాబు ఒక్కసారిగా గట్టిగా ఆరిచాడు.

‘ముల్లును ముల్లుతోనే తియాలంటే ఇదేనేమో.. అయితే ఇది ఎవరూ ఇంట్లో ట్రై చేయకండి. నిపుణురాలు డా.నిహారిక పర్యవేక్షణలో జరిగింది’ అనే  ఫన్నీ క్యాప్షన్‌ తో ఈ వీడియోను షేర్ చేశాడు నాగబాబు. ప్రస్తుతం  ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. తండ్రీకూతుళ్ల అన్యోన్యతను చూసి అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరోవైపు మెగాబ్రదర్‌ చేతికి ఏమైంది? అని ఫ్యాన్స్‌ ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిహారిక పెళ్లితర్వాత కేవలం నిర్మాతగానే రాణిస్తోంది. ఇటీవల ఆమె రూపొందించిన లెటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ హలో వరల్డ్‌ ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్నిసినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్