Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: హలో మిస్.. మా నాన్న పోలీస్ తెలుసా.. స్కూల్‌లో టీచర్‌కు ఓరేంజ్‌లో దమ్కీ ఇచ్చిన బుడ్డోడు..

Funny Video: ఇటీవల ఇంటర్నెట్‌లో పిల్లల ఇన్నోసెంట్‌ వీడియోలు బాగా వైరలవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కోపంగా ఉన్న మేడమ్‌ను బుజ్జగించడం కోసం ఆమె బుగ్గలపై ఓ విద్యార్థి ముద్దుపెట్టిన సంగతి తెలిసిందే.

Funny Video: హలో మిస్.. మా నాన్న పోలీస్ తెలుసా.. స్కూల్‌లో టీచర్‌కు ఓరేంజ్‌లో దమ్కీ ఇచ్చిన బుడ్డోడు..
Kid
Follow us
Basha Shek

|

Updated on: Sep 22, 2022 | 12:47 PM

Funny Video: ఇటీవల ఇంటర్నెట్‌లో పిల్లల ఇన్నోసెంట్‌ వీడియోలు బాగా వైరలవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కోపంగా ఉన్న మేడమ్‌ను బుజ్జగించడం కోసం ఆమె బుగ్గలపై ఓ విద్యార్థి ముద్దుపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలైంది. ఆ చిన్నారిని ప్రయాగ్‌రాజ్‌లోని ఓ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న అథర్వ్ సింగ్‌గా గుర్తించారు. ఇప్పుడు అలాంటి వీడియో మరొకటి సోషల్‌ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారనేది క్లారిటీ లేదు. అయితే బాబు తీరుపై మాత్రం నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ స్టూడెంట్‌ ఏడుస్తూనే తన టీచర్‌ను బెదిరించడం మనం చూడవచ్చు. ముందుగా అమాయకంగా ముఖం పెట్టి’ మా నాన్న పోలీస్‌’ అని చిన్నారి చెబుతాడు. దీనికి రిప్లైగా మేడమ్‌ ‘ అయితే ఏం చేయాలి’ అని సమాధానమిస్తుంది. ఆ తర్వాత విద్యార్థి ‘గోలీమార్‌ దేంగే (బుల్లెట్‌తో కాలుస్తాను)’ అని చెబుతాడు. దీనికి టీచర్‌ నవ్వుతూ ‘నీకు చదువుకోవడం ఇష్టం లేదా’ అని అడుగుతుంది. ఇలా అమాయకత్వంతో టీచర్‌ని బెదిరించిన వీడియోను @Gulzar_sahab అనే ట్విట్టర్‌లో హ్యాండిల్‌తో షేర్ చేశారు ‘మా నాన్న పోలీసుల్లో ఉన్నారు’ అనే క్యాప్షన్‌ను జోడించారు. నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మిక్స్‌డ్‌ రియాక్షన్లు వస్తున్నాయి. కొంతమంది వీడియో ఫన్నీగా ఉందని కామెంట్‌ చేస్తుంటే మరికొందరు మాత్రం చిన్న పిల్లల్లో ఇలాంటి ఆలోచనలు చాలా ఆందోళన కలిగించే విషయమని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..