Viral Video: అంటార్కిటికాలో గడ్డ కట్టిన మంచు మీద ‘భారతీయ పండుగ’.. ఆనంద్ మహీంద్రా వీడియో వైరల్..
భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ పండుగలను సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ. ఇలా విదేశాల్లో ఉన్న భారతీయులు సంక్రాంతి, దీపావళి, హోళీ ఇలా రకరకాల పండుగలు జరుపుకోవడం, కొన్ని సందర్భాల్లో..
Viral News: భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ పండుగలను సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ. ఇలా విదేశాల్లో ఉన్న భారతీయులు సంక్రాంతి, దీపావళి, హోళీ ఇలా రకరకాల పండుగలు జరుపుకోవడం, కొన్ని సందర్భాల్లో విదేశాల్లో భారతీయ పండుగలు వైరల్ అయిన ఘటనలు ఉన్నాయి. తాజాగా మంచుకొండలపై ఓ భారతీయ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఈపోస్టు తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా కేరళ ప్రజలు ఓనమ్ పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. మళాయళీలు ఎక్కడ ఉన్నా ఓనమ్ పండుగ జరుపుకోవడం చూస్తాం. సంక్రాంతికి ముగ్గులు వేసినట్టుగా ఓనమ్ సందర్భంగా వివిధ డిజైన్లు, రంగుల్లో రంగోలీలను వేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో అంటార్కిటికాలో గడ్డ కట్టిన మంచు మీద రంగోలి ముగ్గును చెక్కిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
అంటార్కిటికాలో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు ఉంటాయి. మంచు బాగా గడ్డకట్టి ఉంటుంది. అలా గడ్డకట్టిన మంచుపై కొందరు యువకులు ఓనమ్ ముగ్గును చెక్కారు. ఇందుకోసం చిన్నపాటి సుత్తెలు, స్క్రూ డ్రైవర్లను ఉపయోగించారు. అంతా కలిసి చెక్కినా ఎక్కడా ఆకారం చెడకుండా అద్భుతంగా చిత్రీకరించారు. దాని కింద ఓనమ్ ఎట్ అంటార్కిటికా అనే అక్షరాలనూ చెక్కారు. చివరికి అంతా కలిసి ఆ ముగ్గు దగ్గర నిలబడి ఫొటోలకు పోజిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే భారతీయులు ఓనమ్ పండుగను జరుపుకోకుండా ఆపలేం. అది అంటార్కిటికా అయినా సరే అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనికి నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు.
You cannot prevent Indians from celebrating Onam. Even in Antarctica. Outstanding. ?????? pic.twitter.com/JH2jTeCDQ2
— anand mahindra (@anandmahindra) September 21, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..