Cricket: బ్యాటింగ్ ఆర్డర్ పై సూర్య కుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అదే తనకు బెస్ట్ అంటూ..
ఇటీవల కాలంలో T20 క్రికెట్ లో భారత్ జట్టుకు ఇంపార్టెంట్ ప్లేయర్ గా మారాడు సూర్య కుమార్ యాదవ్. క్రీజ్ లో ఉన్నతం సేపు తనదైన స్టైల్ లో బ్యాటింగ్ చేస్తూ టీమ్ స్కోర్ బోర్డును పరిగెత్తిస్తూ ఉంటాడు. ఒక్కోసారి సూర్య షాట్స్ చూసి క్రికెట్ అభిమానులే..
Cricket: ఇటీవల కాలంలో T20 క్రికెట్ లో భారత్ జట్టుకు ఇంపార్టెంట్ ప్లేయర్ గా మారాడు సూర్య కుమార్ యాదవ్. క్రీజ్ లో ఉన్నతం సేపు తనదైన స్టైల్ లో బ్యాటింగ్ చేస్తూ టీమ్ స్కోర్ బోర్డును పరిగెత్తిస్తూ ఉంటాడు. ఒక్కోసారి సూర్య షాట్స్ చూసి క్రికెట్ అభిమానులే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎప్పుడు బంతిని ఎటు కొడతాడో బౌలర్ కూడా అంచనా వేయలేడు. కాని ఏ బాల్ ను ఎలా కొట్టాలో మాత్రం సూర్య ముందే డిసైడ్ అయిపోతాడు. అందుకే స్టార్ బ్యాట్స్ మెన్ డివిలియర్స్ తో ఇటీవల సూర్యకుమార్ యాదవ్ ను పోల్చడం చూస్తున్నాం. తనదైన ఆట శైలితో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఫలితంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లోనూ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసే స్థానం గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆర్డర్ స్థిరంగా లేదు. సందర్భాన్ని బట్టి బ్యాటింగ్ ఆర్డర్ ను మారస్తూ వస్తోంది. గతంలో సూర్యకుమార్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయగా.. ఇటీవల కాలంలో ఓపెనింగ్‌కు వచ్చాడు. దీంతో పలువురు మాజీలు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే సూర్యకుమార్ యాదవ్ మాత్రం తనకు ఏ స్థానం బాగా నచ్చుతుందో మనసులో మాట చెప్పేశాడు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు నాలుగో స్థానం బెస్ట్ అని అభిప్రాయపడ్డాడు.
ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలనని, 1, 3, 4, 5 ఇలా ఎక్కడైనా రాణించగలనంటూ చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్. అయితే వ్యక్తిగతంగా తనకు నాలుగో స్థానం ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాని చెప్పాడు. తాను బ్యాటింగ్ వెళ్లే స్థానం ఆటను తాను నియంత్రించేలా చేస్తుందన్నాడు. తాను 7 నుంచి 15 ఓవర్ల మధ్య బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆటను ఆస్వాదిస్తానని.. ఆసమయంలో సానుకూలంగా ఉండటానికి ప్రయత్నిస్తాంటూ సూర్యకుమార్ యాదవ్ స్సష్టం చేశారు. తాను నేను గొప్ప పవర్ ప్లే, స్ట్రాంగ్ ఫినిషింగ్ చేసిన చాలా టీ20 మ్యాచ్‌లు చూశానని.. అయితే టీ20ల్లో 8 నుంచి 14వ ఓవర్ వరకు చాలా కీలకమని చెప్పాడు. ఆ సమయంలో మెరుగైన స్కోరు కోసం గట్టిగా ప్రయత్నించాలని, తాను ఆ సమయంలో ఎక్కువ రిస్కీ షాట్లు ఆడటానికి ప్రయత్నించబోనని సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇలా తన బ్యాటింగ్ ఆర్డర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఈక్రికెటర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..