Trains Cancelled: రైలు ప్రయాణీకులకు అలర్ట్.. ఆ రూట్లలో రైళ్లు రద్దు.. ఏయే రోజుల్లో అంటే..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. సోలాపూర్ డివిజన్ లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా రెండు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. విజయవాడ సెక్షన్ పరిధిలోని..

Trains Cancelled: రైలు ప్రయాణీకులకు అలర్ట్.. ఆ రూట్లలో రైళ్లు రద్దు.. ఏయే రోజుల్లో అంటే..
Indian Rails
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 18, 2022 | 7:50 AM

Trains Cancelled: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. సోలాపూర్ డివిజన్ లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా రెండు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. విజయవాడ సెక్షన్ పరిధిలోని పడుగుపాడు-వేదయపాలెం మధ్య నాన్-ఇంటర్ లింకింగ్ పనుల కారణంగా పలు ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. రద్దు చేసిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. పూణే-కాజీపేట మధ్య నడిచే వీక్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (22151) రైలు ను సెప్టెంబర్ 23, 30,అక్టోబర్ 9 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాజీపేట-పూణే మధ్య నడిచే వీక్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (22152) రైలును సెప్టెంబర్ 25, అక్టోబర్ 2, 11 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు. సూళ్లూరుపేట-నెల్లూరు మధ్య నడిచే ప్యాసింజర్ (06745) రైలును సెప్టెంబర్ 18 నుంచి 29 వరకు వేదాయపాలెం-నెల్లూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నెల్లూరు-సూళ్లూరుపేట మధ్య నడిచే ప్యాసింజర్ (06746) రైలును ఈ నెల 18వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నెల్లూరు-వేదాయపాలెం మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అలాగే సూళ్లూరుపేట-నెల్లూరు-సూళ్లూరుపేట మధ్య నడిచే ప్యాసింజర్ రైలు 06747, 06748ను కూడా వేదాయపాలెం-నెల్లూరు-వేదాయపాలెం మధ్య రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

మరోవైపు హైదరాబాద్ లో పలు MMTS రైళ్లు రద్దు అయ్యాయి. సెప్టెంబర్ 18వ తేదీ ఆదివారం 34 ఎంఎంటీఎస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. లింగంపల్లి-హైదరాబాద్ రూట్‌లో 9 సర్వీసులు రద్దు కాగా.. హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లోనూ 9 సర్వీసులు రద్దైనట్లు తెలిపింది. ఇక ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో ఏడు సర్వీసులు రద్దు అయ్యాయి. లింగంపల్లి-ఫలక్​నుమా రూట్‌లో 7 సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. లింగంపల్లి – సికింద్రాబాద్, సికింద్రాబాద్-లింగంపల్లి రూట్‌లో ఒక్కో సర్వీసు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..