Viral Video: హెయిర్ కట్ లో ‘గ్రీకువీరుడి’ వరల్డ్ రికార్డు.. ఎన్ని సెకన్లలో అంటే..

సాధారణంగా మనం హెయిర్ కట్ చేయించుకోవాలంటే కనీసం 20 నుంచి 30 నిమిషాలు వెచ్చించాలి. అదే గడ్డం కూడా కలిపి గీయించుకోవాలంటే మరో 10 నుంచి 15 నిమిషాలు అదనం. అదే బిజీ టైంలో హడావుడిగా చేసినా..

Viral Video: హెయిర్ కట్ లో 'గ్రీకువీరుడి' వరల్డ్ రికార్డు.. ఎన్ని సెకన్లలో అంటే..
Hair Dresser Koutoupis
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 14, 2022 | 7:04 PM

Viral News: సాధారణంగా మనం హెయిర్ కట్ చేయించుకోవాలంటే కనీసం 20 నుంచి 30 నిమిషాలు వెచ్చించాలి. అదే గడ్డం కూడా కలిపి గీయించుకోవాలంటే మరో 10 నుంచి 15 నిమిషాలు అదనం. అదే బిజీ టైంలో హడావుడిగా చేసినా కనీసం ఓ 15 నిమిషాలు అయితే పడుతుంది. అంతకంటే వేగంగా కటింగ్ అంతే సాధ్యమయ్యే పనికాదు. ఎంత ఎక్స్ పీరియన్స్ ఉన్నా సరే కనీసం 15 నిమిషాలు పడుతుంది. ఒకవేళ కటింగ్ సరిగ్గా లేకపోతే చూపించి మరీ కట్ చేయించుకుంటాం. మరీ వేగంగా చేస్తే నచ్చకపోవతే కస్టమర్ కోపాన్ని బార్బర్ చవిచూడాల్సి ఉంటుంది. అందుకే కస్టమర్ ని అడిగి మరి అతడి డైరెక్షన్ ప్రకారం హెయిర్ కట్ చేస్తారు. కాని ఓ గ్రీకువీరుడు మాత్రం హెయిర్ కట్ లో వరల్డ్ రికార్డు సృష్టించాడు. కేవలం ఒక నిమిషం లోపే వండర్ ఫుల్ కటింగ్ తో గిన్నిస్ రికార్డు సాధించాడు. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నాదీనిని నిజం చేసి చూపించాడు గ్రీస్ దేశానికి చెందిన వ్యక్తి. పోనీ ఏదో సాదా సీదాగా కటింగ్ చేయలేదు. సరిగ్గా కట్ చేశాడా లేదా అని జడ్జిలు సైతం స్కేలు పెట్టి మరీ కొలిచారండోయ్.. వారే ఈహెయిర్ డ్రెసర్ టాలెంట్ కు ఫిదా అయిపోయారు.

ఈగ్రీకు వీరుడి ఘనకార్యానికి మెచ్చిన గిన్నిస్ సంస్థ అతనికి ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ హెయిర్ కటింగ్ రికార్డు కట్టబెట్టింది. గ్రీస్ దేశంలోని ఏథెన్స్ కు చెందిన కొస్తాంతినోస్ కౌటౌపిస్ అనే బార్బర్ ఈ ఘనత సాధించాడు. 47.17 సెకెన్లలో హెయిర్ కట్ చేశాడు. ప్రస్తుతం ఈ హెయిర్ కటింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి ప్రతిభకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మూడు నిమిషాల నిడివి ఉన్న క్లిప్‌లో మొదటి 30 సెకన్లలో కౌటౌపిస్ తన పని దాదాపు పూర్తిచేశాడు. జుట్టు పర్ఫెక్ట్ స్టైల్ అయ్యే వరకు ఆగి 47.17 సెకన్లలో తన చేతిని పైకి లేపాడు. జుట్టు పొడవును కొలిచి పనిని సక్రమంగా పూర్తి చేశాడని న్యాయ నిర్ణేతలు నిర్ధారించడంతో కౌటౌపిస్ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. త్వరగా ట్రిమ్ కావాలా.. 45 సెకన్ల ట్రిమ్ ఎలా ఉంటుంది అనే క్యాప్షన్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. కస్టమర్ జుట్టును చాలా కచ్చితత్వంతో కత్తిరించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కౌటౌపిస్ నైపుణ్యంపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..