Motorola: ఈ మొబైల్ ఫీచర్స్ తెలిస్తే మతి పోవల్సిందే..స్మార్ట్ ఫోన్ల రంగంలో సంచలనం.. మార్కెట్లోకి ఎప్పుడంటే..
మొబైల్ ఫోన్స్ ప్రియులకు ఓ గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ రంగంలో ఓ సంచలనం.. సరికొత్త ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ రాబోతుంది. చాలామంది మొబైల్ ఫోన్స్ కొనేటప్పుడు ఫోన్ లో ఫీచర్స్ చూస్తుంటారు. అందరూ ముందు చూసేది ర్యామ్ తో పాటు కెమెరా మెగా పిక్సల్ ఎంత అనేది ముందుగా..
Motorola: మొబైల్ ఫోన్స్ ప్రియులకు ఓ గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ రంగంలో ఓ సంచలనం.. సరికొత్త ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ రాబోతుంది. చాలామంది మొబైల్ ఫోన్స్ కొనేటప్పుడు ఫోన్ లో ఫీచర్స్ చూస్తుంటారు. అందరూ ముందు చూసేది ర్యామ్ తో పాటు కెమెరా మెగా పిక్సల్ ఎంత అనేది ముందుగా చూస్తారు. ఇప్పటివరకు 50 మెగా పిక్సల్, 64 మెగా పిక్సల్, 108 మెగా పిక్సల్ కెమెరా ఫీచర్స్ తో ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులో ఉన్నాయి. కాని తొలిసారిగా 200 మెగా పిక్సల్ కెమెరాతో తొలి ఫోన్ రాబోతుంది. అమెరికా స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటోరోలా అదిరిపోయే స్పెసిఫికేషన్లతో రెండు మొబైల్స్‌ని భారత్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేయనుంది. మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా (Motorola Edge 30 Ultra), మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ (Motorola Edge 30 Fusion) పేరుతో ఈ రెండు మొబైల్స్ ను సెప్టంబర్ 13వ తేదీన భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ విషయాన్ని మోటోరోలా అధికారికంగా ప్రకటించింది. భారీ స్థాయిలో పిక్సల్ కెమెరాతో దేశంలో లాంచ్ కానున్న తొలి మొబైల్ గా ఈఫోన్లు రికార్డు సృష్టించనున్నాయి. ఈఫోన్ల ఫీచర్స్ ఓసారి తెలుసుకుందాం.
మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ప్రత్యేకతలు : క్వాల్‌కామ్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్,
ఎడ్జ్ 30 అల్ట్రా ట్రిపుల్ కెమెరా సెటప్
200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50 మెగాపిక్సెల్ సెన్సార్, 12 మెగాపిక్సెల్ సెన్సార్ ముందు భాగంలో, 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
6.67 అంగుళాల పూర్తి Hd+ Oled డిస్‌ప్లేతో 144hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
4,160mah బ్యాటరీ, 125వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, వైర్‌లెస్ చార్జింగ్
డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేసే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు
మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ప్రత్యేతలు : స్నాప్‌డ్రాగన్ 888+ (Qualcomm Snapdragon) ప్రాసెసర్
6.55 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ Poled డిస్‌ప్లే, 144hz రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్
Motorola Edge 30 Fusion వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
4,400mah బ్యాటరీ, 68వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
ధర, కలర్స్: ఇప్పటికే ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు యూరోపియన్ మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యాయి. ఎడ్జ్ 30 ప్యూజన్ ఐరోపాలో 600 యూరోలు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 48,000 ఉండొచ్చని అంచనా. ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఫోన్ కాస్మిక్ గ్రే, అరోరా వైట్, సోలార్ గోల్డ్, నెప్ట్యూన్ బ్లూ వంటి కలర్స్‌లో లభ్యమవుతుంది. అదేవిధంగా, ఎడ్జ్ 30 అల్ట్రా ధర 899.99 యూరోలు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 72,900 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మొబైల్ స్టార్‌లైట్ వైట్, ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ రంగులలో వస్తోంది.
Introducing the all-new #motoroaledge30ultra! The World’s First* 200MP Camera Smartphone gives Unmatched Resolution & Unmatched Picture Quality. Experience the fastest Snapdragon 8+ Gen1, 125W charging & more. Launching 13th Sept. on @Flipkart and retail stores!
— Motorola India (@motorolaindia) September 9, 2022
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..