AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishnam Raju: రాజకీయాల్లోనూ విలక్షణ నేత..కాంగ్రెస్ టు బీజేపీ కృష్ణంరాజు రాజకీయ ప్రస్థానం..

సినిమాల్లో రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉప్పలపాటి కృష్ణంరాజు రాజకీయాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. కేంద్రమంత్రిగా పనిచేసి రాజకీయనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ లోక్ సభ నియోజకవర్గం..

Krishnam Raju: రాజకీయాల్లోనూ విలక్షణ నేత..కాంగ్రెస్ టు బీజేపీ కృష్ణంరాజు రాజకీయ ప్రస్థానం..
Krishnamraju
Amarnadh Daneti
|

Updated on: Sep 11, 2022 | 7:54 AM

Share

Krishnam Raju: సినిమాల్లో రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉప్పలపాటి కృష్ణంరాజు రాజకీయాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. కేంద్రమంత్రిగా పనిచేసి రాజకీయనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున తొలిసారి ఏంపీగా గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. 1998 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 42 స్థానాలకు గానూ బీజేపీ నాలుగు స్థానాల్లో గెలవగా.. అందులో కాకినాడ నుంచి కృష్ణం రాజు గెలిచారు. అదే ఎన్నికల్లో రాజమండ్రి, కరీంనగర్, సికింద్రాబాద్ లో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. కృష్ణంరాజు రాజకీయ ప్రస్థానం బీజేపీతోనే ప్రారంభంమైందని అందరూ అనుకుంటారు. కాని కృష్ణం రాజు రాజకీయ ప్రస్థానం తొలుత కాంగ్రెస్ తో ప్రారంభమైంది. 1990లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత 1991లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు.తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయ్ కుమార్ రాజు చేతిలో ఓటమి చెందారు. కృష్ణంరాజుకు 2,59,154 ఓట్లు రాగా.. టిడిపి అభ్యర్థి విజయ్ కుమార్ రాజుకు 3,17,703 ఓట్లు వచ్చాయి. ఆఎన్నికల్లో సానుకూల ఫలితం రాకపోవడంతో కృష్ణంరాజు కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆతర్వాత బీజేపీ నుంచి ఆహ్వానం అందటంతో ఆయన కమలం పార్టీలో చేరారు.

బీజేపీలో చేరిన తర్వాత రాజకీయాల్లో కృష్ణంరాజుకు అదృష్టం కలిసొచ్చింది. 1998లో కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన తోట గోపాలకృష్ణపై 67,799 ఓట్ల భారీ అధిక్యంతో గెలుపొందారు. ఆఎన్నికల్లో కృష్ణం రాజుకు 3,30,381 ఓట్లు రాగా.. సమీప అభ్యర్థి తోట గోపాలకృష్ణకు 262,582 ఓట్లు వచ్చాయి. పొత్తు లేకుండా ఒంటరిగా పోటీచేసి బీజేపీ తరపున కృష్ణంరాజు గెలిచి ఓరికార్డు సృష్టించారు. కాకినాడ ఏంపీగా ఏడాది మాత్రమే ఆయన పనిచేశారు. ఇక 1999 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఏంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఆఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై 1,65,948 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. సొంత జిల్లా కావడంతో కృష్ణం రాజు భారీ మెజార్టీ సాధించారు. ఇక రెండో సారి ఏంపీగా గెలవడంతో బీజేపీ అధినాయకత్వం ఆయనను కేంద్రమంత్రి పదవితో గౌరవించింది. 2000 నుంచి 2004 వరకు ఆయన కేంద్ర మంత్రిగా సేవలందించారు. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు.

2000 సెప్టంబర్ 30వ తేదీ నుంచి 2004 మే 22 వరకు కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. తొలుత కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా 200 సెప్టెంబర్ 30 నుంచి 2001 జులై 22వరకు సేవలందించారు. ఆతర్వాత 2001 జులై నుంచి 2002 జులై వరకు ఏడాది పాటు రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2002 జులై1 నుంచి వినియోగదారుల వ్యవహరాలు, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా, 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర గ్రామీణాభివద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. 2004లో తిరిగి నరసాపురం లోక్ సభ నుంచి ఏంపీగా పోటీచేసి.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెందిన చేగొండి వెంకట హరిరామ జోగయ్య చేతిలో 64,412 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆతర్వాత కొంత కాలం రాజకీయాలకు అంటిముట్టనట్టుగా ఉన్న ఆయన.. 2009 మార్చిలో అప్పట్లో సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.

ఇవి కూడా చదవండి

రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ విలీనం చేయడంతో తిరిగి ఆయన 2013లో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షులు రాజ్ నాధ్ సింగ్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు. అప్పటినుంచి వయస్సు రీత్యా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయనప్పటికి.. భారతీయ జనతాపార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వచ్చారు. ఇటీవల ఆయనను గవర్నర్ గా నియమించవచ్చనే ఊహగానాలు వచ్చినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు. కృష్ణంరాజు లోక్ సభ సభ్యుడిగా ఉన్న కాలంలో వివిధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. 1998 నుంచి 1999 వరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన కన్సలెటివ్ కమిటీ సభ్యునిగా పనిచేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..