Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishnam Raju Passes Away: కృష్ణంరాజు మరణం.. బరువెక్కిన గుండెతో ఆసుపత్రిలో ప్రభాస్.. వీడియో వైరల్

తెలుగు సినిమా ఇండస్ట్రీ మూగబోయింది. ప్రముఖ నటుడు కృష్ణం రాజు(Krishnam Raju Death ) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలిసి సినీలోకం విషాదంలో మునిగిపోయింది.

Krishnam Raju Passes Away: కృష్ణంరాజు మరణం.. బరువెక్కిన గుండెతో ఆసుపత్రిలో ప్రభాస్.. వీడియో వైరల్
Krishnam Raju
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 11, 2022 | 9:42 AM

తెలుగు సినిమా ఇండస్ట్రీ మూగబోయింది. ప్రముఖ నటుడు కృష్ణం రాజు(Krishnam Raju Death ) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలిసి సినీలోకం విషాదంలో మునిగిపోయింది. 83ఏళ్ల కృష్ణం రాజు తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ నేడు( ఆదివారం) తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణం రాజు మరణవార్తతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అభిమానులంతా కృష్ణం రాజు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయాయిరు. గత కొద్దిరోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న కృష్ణం రాజు ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఆదివారం తెల్లవారు జామున 3:25గంటలకు మరణించారు. కోవిడ్ సమయంలో ఒకటి రెండు సార్లు కృష్ణంరాజుకు ఆస్పత్రిలో చికిత్స జరిగింది.

ప్రస్తుతం కృష్ణం రాజు భౌతికకాయం ఏఐజీ ఆస్పత్రిలోనే ఉంది. మరికొద్దిసేపట్లో ఆయన పార్ధివదేహాన్ని ఇంటికి తరలించనున్నారు. సోమవారం కృష్ణం రాజు అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తోంది. ఇక ఏఐజీ ఆస్పత్రిలోనే నిన్నటి నుంచి కృష్ణంరాజు కుటుంబసభ్యులు ఉన్నారు. ఇక ఆస్పత్రి నుంచి ఆయన తనయుడు ప్రభాస్ అతడి స్నేహితులు వెళుతూ కనిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే ప్రభాస్, కృష్ణం రాజు కలిసి ఉన్న పాత వీడియోలు కూడా వైరల్ అవుతోంది. కృష్ణం రాజు 183 చిత్రాలకుపైగా నటించారు. కృష్ణంరాజు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు. 1940, జనవరి20న జన్మించారు. కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు. కృష్ణం రాజు మరణ వార్త తెలిసి మొగల్తూరు లో విషాదం నిండిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.