AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: యశోద సినిమాకు సమంత ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా ?..

ఇందులో లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో వస్తోన్న మూవీ యశోద. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Samantha: యశోద సినిమాకు సమంత ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా ?..
Samantha
Rajitha Chanti
|

Updated on: Sep 10, 2022 | 8:29 PM

Share

ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‏తో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది సమంత (Samantha). ఇక అదే సమయంలో అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా సామ్ పేరు నెట్టింట ట్రెండ్ అయ్యింది. అప్పటి నుంచి ఆమె షేర్ చేసే ప్రతి పోస్ట్ పట్ల నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక విడాకుల అనంతరం సామ్ సైతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయ్యింది. ఇటీవలే పుష్ప చిత్రంలోని ఊ అంటావా మావా పాటతో రచ్చ చేసింది. ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. శాకుంతలం సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతండగా.. ఖుషి, యశోద చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇందులో లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో వస్తోన్న మూవీ యశోద. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఇండస్ట్రీలో సమంత రెమ్యునరేషన్ హాట్ టాపిక్‏గా మారింది. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో సామ్ ఒకరు. గతంలో ఊ అంటావా మావ పాట కోసం ఏకంగా కోటిన్నర రెమ్యునరేషన్ తీసుకుందట సామ్. ఇక ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ గా వస్తోన్న యశోద కోసం ఏకంగా రూ. 3 కోట్లు పారితోషికం తీసుకుంటుందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక దృవీకరణ లేదు. మరోవైపు డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో సామ్ ఖుషి సినిమాలో నటిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!
ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!
డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్
డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్
చిన్న సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీ విష్ణు
చిన్న సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీ విష్ణు
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
కొత్త ఇల్లు కొనబోతున్నారా? ముందుగా ఈ 6 వాస్తు నియమాలు చెక్ చేసుకో
కొత్త ఇల్లు కొనబోతున్నారా? ముందుగా ఈ 6 వాస్తు నియమాలు చెక్ చేసుకో
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం
హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!